టీకా ప్రభావం: ఆ దేశాధ్యక్షుడు ఏమన్నారంటే..
close

తాజా వార్తలు

Updated : 13/07/2021 17:15 IST

టీకా ప్రభావం: ఆ దేశాధ్యక్షుడు ఏమన్నారంటే..

మాస్కో: కొవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి డోస్‌ తీసుకున్న అనంతరం తనకు అసౌకర్యంగా అనిపించిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తెలిపారు. టీకా తీసుకున్నవారిలో స్వల్ప దుష్పభావాలు ఎదురవుతున్నాయని ఇప్పటికే కొన్ని దేశాల్లో విమర్శలు వస్తున్నాయి. అయితే టీకా పొందిన తర్వాత తనకు కూడా స్వల్పంగా ఆరోగ్య సమస్య తలెత్తిందని పుతిన్‌ పేర్కొన్నారు. ‘వ్యాక్సిన్‌ పంపిణీలో భాగంగా మంగళవారం టీకా తీసుకున్నాను. తర్వాతి రోజు ఉదయం నా ఎముకల్లో కాస్త నొప్పిగా అనిపించింది. అయినా థర్మామీటర్‌లో శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయిలోనే చూపించింది’ అని ప్రెసిడెంట్ చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్పుత్నిక్ వీ టీకా అందుబాటులో ఉందని ఆయన వివరించారు.

కాగా, దేశంలో 4.3 మిలియన్ల మంది వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నారని పుతిన్ గతంలో ప్రకటించారు. వేసవి చివరి నాటికి అందరిలో రోగనిరోధక శక్తి పెరగాలని కోరుకుంటున్నట్లు రష్యా అధ్యక్షుడు ఆకాంక్షించారు. టీకా పంపిణీ కార్యక్రమాన్ని రష్యా డిసెంబర్‌లోనే ప్రారంభించిన విషయ తెలిసిందే.. ఈ క్రమంలో దేశంలో ఇంకా రెండొంతుల మంది స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ తీసుకోలేదని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 4.5 మిలియన్‌ల మంది కరోనా బారినపడ్డట్లు అధికారులు వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని