West Bengal: కొనసాగుతోన్న భవానీపూర్‌ ఉపఎన్నిక.. టీఎంసీ, భాజపా మాటల యుద్ధం

తాజా వార్తలు

Updated : 30/09/2021 10:32 IST

West Bengal: కొనసాగుతోన్న భవానీపూర్‌ ఉపఎన్నిక.. టీఎంసీ, భాజపా మాటల యుద్ధం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్న భవానీపూర్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. గురువారం ఉదయం 7 గంటలకు ఓటింగ్‌ ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. భవానీపూర్‌తో పాటు బెంగాల్‌లోని జాంగీపూర్‌, సంషేర్‌గంజ్‌, ఒడిశాలోని పిప్లీ నియోజకవర్గాలకు కూడా నేడు పోలింగ్‌ జరుగుతోంది.  ఉదయం 9 గంటల సమయానికి భవానీపూర్‌లో 7.57శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. కాగా.. గత అసెంబ్లీ ఎన్నికల వేళ బెంగాల్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను దృష్టిలో ఉంచుకుని నేటి పోలింగ్‌ను భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పారామిలిటరీ బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. 

టీఎంసీపై భాజపా ఫైర్‌..

ఇదిలా ఉండగా.. భవానీపూర్‌లో టీఎంసీ అక్రమాలకు పాల్పడుతోందని భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్‌ ఆరోపించారు. టీఎంసీ ఎమ్మెల్యే మదన్‌మిత్రా పోలింగ్‌ కేంద్రాన్ని తన అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. అయితే ఆమె ఆరోపణలను బెంగాల్‌ మంత్రి ఫిర్హాద్‌ హకీమ్‌ కొట్టిపారేశారు. పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలిపారు. సాయంత్రం 6.30 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని