China: ఏనుగుల గుంపు.. పాదయాత్ర చేస్తూనే ఉన్నాయి! 

తాజా వార్తలు

Published : 23/07/2021 23:52 IST

China: ఏనుగుల గుంపు.. పాదయాత్ర చేస్తూనే ఉన్నాయి! 

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాలో మహాపాదయాత్ర చేస్తున్న ఏనుగుల మంద మరోసారి కంటపడింది. ఏనుగులు ఎర్రని దుమ్ములో పొర్లాడుతున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గతేడాది యునాన్ ప్రావిన్స్‌లోని అభయారణ్యం నుంచి బయటకు వచ్చిన ఈ ఏనుగులు ప్రస్తుతం కున్మింగ్ నగరానికి సమీపంలో కనిపించాయి. ఏనుగుల మంద ప్రయాణాన్ని 410 మందితో కూడిన ప్రత్యేక బృందం నిత్యం గమనిస్తోంది. ఈ ఏనుగులు సుదీర్ఘ ప్రయాణం చేసేందుకు ప్రేరేపించిన కారణం మాత్రం ఇప్పటికీ తెలియడంలేదు. కాగా మొక్కజొన్న వంటి రుచికరమైన ఆహారం కోసం అవి ప్రయాణిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని