గేట్స్‌ ఫౌండేషన్‌కు బఫెట్‌ గుడ్‌బై
close

తాజా వార్తలు

Updated : 24/06/2021 11:38 IST

గేట్స్‌ ఫౌండేషన్‌కు బఫెట్‌ గుడ్‌బై

న్యూయార్క్‌: ప్రపంచ కుబేరుడు, బెర్క్‌షైర్‌ హాత్‌వే ఛైర్మన్‌ వారెన్‌ బఫెట్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బిల్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ట్రస్టీ పదవి నుంచి ఆయన వైదొలిగారు. బిల్‌ గేట్స్‌, మెలిందా దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన కొద్దిరోజులకు బఫెట్‌ నుంచి ఈ నిర్ణయం వెలువడింది.

గత కొన్నేళ్లుగా ట్రస్టీగా కొనసాగుతున్నప్పటికీ.. క్రియాశీలంగా లేనని, ట్రస్టీ పదవికి రాజీనామా చేస్తున్నానని బఫెట్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే బర్క్‌షైర్‌ హాత్‌వే షేర్లను నూరు శాతం సేవా కార్యక్రమాలకు వినియోగించాలన్న తన లక్ష్యాన్ని ఇప్పటికే సగం పూర్తి చేసినట్లు తెలిపారు. అయితే, ట్రస్టీగా వైదొలగడానికి గల కారణాలను మాత్రం బఫెట్ వెల్లడించలేదు. బిల్‌గేట్స్‌, మెలిందాతో పాటు ముగ్గురు సభ్యుల బోర్డులో సభ్యుడైన బఫెట్‌.. గత 15 ఏళ్లలో సుమారు 27 బిలియన్‌ డాలర్లను బిల్‌మిలిందా ఫౌండేషన్‌ ద్వారా సేవా కార్యక్రమాలకు వెచ్చించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని