Covid vaccine: టీకా తీసుకోలేదని పదవికి ఎసరు..!

తాజా వార్తలు

Published : 19/10/2021 19:58 IST

Covid vaccine: టీకా తీసుకోలేదని పదవికి ఎసరు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌ టీకా తీసుకోలేదని అమెరికాలోని ఓ అత్యున్నత విద్యాసంస్థ ఫుట్‌బాల్‌ కోచ్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్శిటి ఫుట్‌బాల్‌ కోచ్‌ నిక్‌ రోలోవిచ్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. అతనే విశ్వవిద్యాలయంలో అత్యధిక వేతనం పొందుతున్న ఉద్యోగి కావడం విశేషం. 42 ఏళ్ల రోలోవిచ్‌ మతపరమైన కారణాలతో టీకా తీసుకోకుండా మినహాయింపు కోరాడు. కానీ, విశ్వవిద్యాలయ అథ్లెటిక్స్‌ డైరెక్టర్‌ పాట్‌ చున్‌ ఇందుకు నిరాకరించారు. 

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు అందరూ రెండు డోసుల టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలని వాషింగ్టన్‌ గవర్నర్‌ జాయ్‌ ఇన్సులీ ఆగస్టులో ప్రకటించారు. లేకపోతే ఉద్యోగాల్లో కొనసాగరనే హెచ్చరికలు జారీ చేశారు. సాధ్యంకాని పక్షంలో కనీసం మతపరమైన లేదా ఆరోగ్య కారణాలతో మినహాయింపులు పొందాలని సూచించారు. వ్యాక్సిన్లు తీసుకోవడానికి సోమవారంతో తుదిగడువు ముగిసింది. కానీ, రోలోవిచ్‌ మాత్రం వ్యక్తిగత కారణాలతో టీకా తీసుకోనట్లు ప్రకటించారు. దీంతో ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఆయన జీతం 35లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.26 కోట్లు..!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని