‘కూ’..పూర్తిగా భారత్‌ యాప్‌

తాజా వార్తలు

Published : 11/02/2021 16:32 IST

‘కూ’..పూర్తిగా భారత్‌ యాప్‌

వెల్లడించిన సహవ్యవస్థాపకుడు

దిల్లీ: ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రాం తరవాత ఇప్పుడు భారత నెటిజన్లకు బాగా వినిపిస్తోన్న పేరు ‘కూ’. మేము కూలో చేరామంటూ కేంద్ర మంత్రులు ప్రకటించడం, దానిలో స్పందిస్తుండటంతో ఒక్కసారిగా దాని ప్రాముఖ్యత పెరిగింది. కాగా, దీనిపై కూ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అప్రమేయ రాధాక్రిష్ణ స్పందించారు. 

‘కూ..భారత్‌లో రిజిస్టర్ అయిన కంపెనీ. దీన్ని భారత్‌కు చెందిన వ్యక్తులే నెలకొల్పారు. రెండున్నరేళ్ల క్రితం మేము నిధులు సమీకరించాం. ఇప్పుడు భారత్‌కు చెందిన 3వన్‌4 బాంబినేట్‌కు నిధులు సమకూర్చుతోంది. ఇంతకు ముందు మా కూలో పెట్టుబడి పెట్టిన షునేవీ పూర్తిగా బయటకువెళ్లిపోతోంది’ అని రాధాక్రిష్ణ వెల్లడించారు. ఇది ఇప్పుడు పూర్తి స్థాయి ఆత్మనిర్భర్ భారత్ యాప్‌ అని ఆయన మీడియాకు వెల్లడించారు. 

బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ కంపెనీ బాంబినేట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అప్రమేయ రాధాకృష్, మరో వ్యాపారవేత్త మయాంక్ బిద్వత్క కలిసి ట్విటర్‌ను పోలి ఉండే ఈ కూ యాప్‌ను రూపొందించారు. అయితే 2018లో చైనాకు చెందిన షునేవీ దీనికి నిధులు సమకూర్చింది. కాగా, ఇప్పుడు భారత పెట్టుబడిదారులే ఆ యాప్‌కు నిధులు అందిస్తున్నారు. ఇదిలా ఉండగా..ప్రధాని మన్‌కీ బాత్‌లో దీనిగురించి ప్రస్తావించడం, గతేడాది ప్రభుత్వం నిర్వహించిన ఆత్మనిర్భర్ యాప్ ఛాలెంజ్‌లో ఉత్తమ సోషల్ మీడియా యాప్‌గా నిలవడంతో ఇది అందరి దృష్టిలో పడింది. 

ఇవీ చదవండి:

ట్విటర్‌కు పోటీగా ‘కూ’తకొచ్చింది..!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని