సంపన్న దేశాల్లో 25 రెట్లు వేగంగా..

తాజా వార్తలు

Published : 09/04/2021 14:21 IST

సంపన్న దేశాల్లో 25 రెట్లు వేగంగా..

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచంలోని 5 శాతం జనాభాకు సరిపోయే టీకాలతో ఇప్పుడు వ్యాక్సినేషన్‌ జరుగుతోంది. కానీ వీటి పంపిణీలో మాత్రం తీవ్ర అసమానతలు నెలకొన్నాయి. సంపన్న దేశాల్లోనే అత్యధికంగా వ్యాక్సినేషన్‌ జరుగుతోంది. గురువారం నాటికి మొత్తం టీకాల్లో 40 శాతం కేవలం 27 సంపన్న దేశాల్లోనే వినియోగిస్తున్నారని తేలింది. ఈ దేశాల మొత్తం జనాభా ప్రపంచ జనాభాలో 11 శాతానికి సమానం. 11 శాతం అంత్యంత పేద దేశాలకు లభించిన టీకాల వాటా 1.6 శాతమే.

ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ ట్రాకర్‌ వెల్లడిస్తోంది.  ఒక్కముక్కలో చెప్పాలంటే అత్యధిక ఆదాయం ఉన్న దేశాలు పేద దేశాల కంటే 25 రెట్లు ఎక్కువ టీకాలను వేశాయి. ఆ సంస్థ‌ ఇప్పటి వరకు154 దేశాల్లో వేసిన 72.6 కోట్ల డోసులను పరిగణనలోకి తీసుకొంది. ప్రపంచంలో అమెరికా జనాభా 4.3 శాతం కాగా.. మొత్తం వ్యాక్సినేషన్‌లో 24శాతం ఇక్కడే జరిగింది. అదే పాకిస్థాన్‌లో జనాభా ప్రపంచంలో 2.7శాతానికి సమానం కాగా, అక్కడ కేవలం 0.1 శాతం మందికే టీకాలు లభించాయి. చాలా సంపన్న దేశాలు ముందస్తుగానే వందల కోట్ల డోసులు కొనిపెట్టుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. వచ్చే మూడు నెలల్లో తమ జనాభాలో 75శాతం మందికి టీకాలు వేయాలనే లక్ష్యంతో అమెరికా ముందుకెళుతోంది. మరోపక్క ప్రపంచంలోనే సగానికి పైగా దేశాలు ఇప్పటి వరకు 1 శాతం జనాభాకు కూడా వ్యాక్సిన్‌  వేయలేదు. అసలు మరో 40 పేద దేశాల్లో ఎంతమందికి టీకాలు వేశారనే సమాచారం కూడా  లేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని