
తాజా వార్తలు
ఇక్కడికి ఎందుకొచ్చానంటే.. బైడెన్
కొవిడ్‌ను గెలుస్తామంటూ విశ్వాసం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జో బైడెన్ ఇప్పటివరకు రెండే సార్లు వైట్‌హౌస్ వెలుపల పర్యటించారు. కరోనా కట్టడికి తమ ప్రభుత్వం అనుసరించనున్న వ్యూహాన్ని గురించి వివరించేందుకు తొలిసారి మిల్వాకీలోని టౌన్ హాల్ సమావేశానికి హాజరయ్యారు. కాగా, రెండోసారి ఈ ఆదివారం (స్థానిక కాలమానం ప్రకారం) మిషిగన్‌లోని కొవిడ్ టీకాల ఉత్పత్తి చేస్తున్న ఫైజర్ కర్మాగారాన్ని సందర్శించారు.
ఈ కర్మాగారం ల్యాబ్ సిబ్బందితో మాట్లాడిన బైడెన్, ఫైజర్ టీకా తయారీ విధానాన్ని గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి ఉద్యోగుల నిరంతర శ్రమ ఫలితంగానే అమెరికన్లు కొవిడ్-19 పై విజయం సాధించనున్నారని ఆయన తెలిపారు. ఇందుకుగాను ఆయన కర్మాగార సిబ్బందికి కృతజ్ఞతలు తెలియచేశారు. దేశం ఇప్పటి వరకు ఎదుర్కొన్న సవాళ్లన్నిటికంటే కరోనా క్లిష్టమైనదని.. దానిని జయించేందుకు జరుగుతున్న అసాధారణమైన కృషిని, ప్రయత్నాన్ని గురించి అమెరికా ప్రజలందరరూ అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతోనే తాను అక్కడకు వచ్చినట్టు బైడెన్ ప్రకటించారు.