బెంగాల్‌ పోరు: ముగిసిన తుది దశ పోలింగ్‌

తాజా వార్తలు

Published : 29/04/2021 18:59 IST

బెంగాల్‌ పోరు: ముగిసిన తుది దశ పోలింగ్‌

మే 2న ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు జరిగిన తుది దశ పోలింగ్ ముగిసింది. ఎనిమిదో దశలో భాగంగా నేడు 35 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌ పూర్తయ్యింది. చివరి దశలోనూ పలుచోట్ల ఉద్రిక్తతలు చెలరేగాయి. సాయంత్రం 6.30గంటల వరకు అక్కడ 76.07శాతం పోలింగ్‌ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రంలో కొవిడ్‌ తీవ్రత ఉన్నప్పటికీ తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు బెంగాల్‌ ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్‌ బూత్‌లకు తరలివచ్చారు. దీంతో అన్ని దశల్లోనూ పశ్చిమబెంగాల్‌లో భారీ పోలింగ్‌ నమోదయ్యింది.

పశ్చిమ బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా మొత్తం ఎనిమిది దశల్లో అక్కడ ఎన్నికలు జరిగాయి. మార్చి 27న మొదలైన ఎన్నికల ప్రక్రియ నేటితో ముగిసింది. మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ఇక పశ్చిమ బెంగాల్‌తో పాటే తమిళనాడు(234), అస్సాం(40), కేరళ(140), పుదుచ్చేరి(30) రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో పోటిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. మే 2 వ తారీఖున తాజాగా ఎన్నికల జరిగిన అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని