Lockdown: పశ్చిమ్ బెంగాల్‌లో లాక్‌డౌన్
close

తాజా వార్తలు

Updated : 15/05/2021 14:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Lockdown: పశ్చిమ్ బెంగాల్‌లో లాక్‌డౌన్

రేపటి నుంచి మే 30వరకు అమల్లో ఆంక్షలు

కోల్‌కతా: రెండో దశ కరోనా ఉద్ధృతితో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌, ఆంక్షల ఛట్రంలోకి వెళ్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి పశ్చిమ్‌ బెంగాల్‌ చేరింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. మే 30 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను విధిస్తూ శనివారం పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపు(ఆదివారం) ఉదయం ఆరు గంటల నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. 

పరిశ్రమలు, అంతరాష్ట్ర రైళ్లు, బస్సులు, మెట్రో రైళ్ల వంటి అన్ని సేవలను మూసివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. మతపరమైన సమావేశాలతో సహా అన్ని రకాల సమావేశాలపై నిషేధాజ్ఞలు విధించింది. విద్యాసంస్థల విషయంలో కూడా ఇవే ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. టీ తోటల్లో 50 శాతం, జనపనార మిల్లుల్లో 30 శాతం మంది కార్మికులు పనిచేసేలా వెసులుబాటు కల్పించింది. అత్యవసర సేవలను అనుమతించడంతో పాటు, అవసరమైన వస్తువుల కొనుగోలుకు ఉదయం ఏడు నుంచి 10 గంటల వరకు 3 గంటలు దుకాణాలు తెరిచి ఉంచేలా ఆదేశాలు జారీచేసింది.

తాజాగా బెంగాల్‌లో 20,846 మందికి కరోనా సోకగా..136 మంది ప్రాణాలు వదిలారు. మార్చి నుంచి ఎనిమిది దశల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఆ రాష్ట్రంలో వైరస్ ఉద్ధృతికి దోహదం చేశాయని అధికారులు అంటున్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు పార్టీలకు చెందిన కీలక నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. కొవిడ్ ఆంక్షలను మరిచి.. ఆ సభలకు పెద్దఎత్తున జనాలు హాజరయ్యారు. ఈ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని