Delta Plus: ప్రస్తుతానికి ‘ఆందోళనకరం’ కాదు! WHO
close

తాజా వార్తలు

Published : 01/07/2021 20:17 IST

Delta Plus: ప్రస్తుతానికి ‘ఆందోళనకరం’ కాదు! WHO

‘కొవాగ్జిన్‌’పై ఆగస్టులో రెండో వారంలో నిర్ణయం

దిల్లీ: దేశంలో కొత్తగా వెలుగు చూసిన డెల్టా ప్లస్‌ వేరియంట్‌ను ప్రస్తుతానికి ఆందోళనకర రకం (Variant of Concern)గా ప్రపంచ ఆరోగ్య సంస్థ భావించడం లేదని ఆ సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా వ్యాక్సిన్‌ పాస్‌పోర్టులో భాగంగా ‘కొవిషీల్డ్‌’ టీకాను కొన్ని దేశాలు నిరాకరించడం వెనుక సమర్థనీయ వాదన ఏమీ లేదన్నారు. ఓ జాతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సౌమ్య స్వామినాథన్‌.. ‘కొవాగ్జిన్‌’ అనుమతిపై ఆగస్టు రెండో వారంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు.

కొన్ని దేశాలు కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను అనుమతించకపోవడం వెనుక ఆయా దేశాల్లో ఆస్ట్రాజెనెకా వివిధ బ్రాండ్ల పేరుతో ఉండడమే కారణంగా కనిపిస్తోందని WHO చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ అభిప్రాయపడ్డారు. ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించి వ్యాక్సిన్‌ పాస్‌పోర్టులో కొవిషీల్డ్‌ను చేర్చడంపై యురోపియన్‌ ఔషధ నియంత్రణ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు.

ఇదిలాఉంటే, కొత్తగా వెలుగు చూసిన డెల్టా ప్లస్‌ వేరియంట్‌ 12దేశాలకు విస్తరించింది. ఇటు భారత్‌ ఇప్పటికే దీనిని ఆందోళనకర వేరియంట్‌గా గుర్తించింది. దేశంలో ఈ రకం వైరస్‌ 12 రాష్ట్రాలకు విస్తరించగా..ఇప్పటివరకు దాదాపు 60కేసులు నమోదయ్యాయి. ఇతర వేరియంట్‌లతో పోలిస్తే డెల్టా ప్లస్‌ రకం ఊపిరితిత్తుల కణాజాలనికి ఎక్కువ ఆకర్షితమవుతోందని.. అయినప్పటికీ దానివల్ల నష్టం జరుగుతుందో లేదో అనే విషయంపై ఇంకా స్పష్టత లేదని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌కే అరోరా ఈమధ్యే వెల్లడించారు. వైరస్‌ వ్యాప్తి, ఇన్‌ఫెక్షన్‌ ప్రభావాన్ని తెలుసుకునేందుకు మరింత నిశిత పరిశీలన అవసరమన్నారు. అప్పుడే వైరస్‌ వ్యాప్తి సామర్థ్యాన్ని అంచనా వేయగలమని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఆయా రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉంటూ.. కట్టడి చర్యలు ముమ్మరంగా చేపట్టాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని