close

తాజా వార్తలు

Updated : 24/01/2021 12:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారత్‌ సహకారానికి కృతజ్ఞతలు: WHO

దిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్ అందిస్తోన్న సహకారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. దేశంలో టీకా కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు పొరుగు దేశాలకు వాటిని పంపిణీ చేస్తోంది. ఆ జాబితాలో బ్రెజిల్, మొరాకొ దేశాలు కూడా ఉన్నాయి. త్వరలో దక్షిణాఫ్రికాకు టీకాను అందించనుంది. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. 

‘కరోనాపై పోరాటంలో భారత్, ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తోన్న నిరంతర సహకారానికి కృతజ్ఞతలు. మనం కలిసి పనిచేస్తేనే..ఈ వైరస్‌ను అడ్డుకోగలం. జీవితాలను, జీవనోపాధిని కాపాడగలం’ అని ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ కొనియాడారు. 

టీకా సహకారంపై బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన అనంతరం టెడ్రోస్ నుంచి ఈ స్పందన రావడం గమనార్హం. తమ దేశానికి కొవిడ్ టీకాలు పంపడంపై బ్రెజిల్‌ అధ్యక్షుడు వినూత్న రీతిలో భారత్‌ ఉదారతను మెచ్చుకున్నారు. టీకాలను సంజీవనితో పోల్చుతూ..వాటిని హనుమంతుడు భారత్ నుంచి బ్రెజిల్‌కు మోసుకొస్తున్నట్లు ఉన్న చిత్రాన్ని ట్విటర్‌లో షేర్ చేశారు.  

ఇవీ చదవండి:

భారత్‌కు బ్రెజిల్ అధ్యక్షుడి వినూత్న కృతజ్ఞత!




Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని