టీకాల్లో వారికి ప్రాధాన్యత అవసరం లేదు: WHO
close

తాజా వార్తలు

Updated : 27/01/2021 06:24 IST

టీకాల్లో వారికి ప్రాధాన్యత అవసరం లేదు: WHO

వాషింగ్టన్‌: కరోనా వ్యాక్సిన్‌ పంపిణీలో అంతర్జాతీయ ప్రయాణికులకు ప్రస్తుతానికి ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌లకు కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ బృందం ఈ విధంగా స్పందించింది. ముఖ్యంగా తొలుత ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలతో పాటు ప్రతి దేశంలో 20శాతం మందికి తొలుత వ్యాక్సిన్‌ అందించాలని డబ్ల్యూహెచ్‌ఓ పిలుపునిచ్చింది.

కరోనా వ్యాక్సిన్‌ కొద్దిమేరకే అందుబాటులో ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులకు ఇవ్వడం అసమానతలకు కారణమవుతుందని డబ్ల్యూహెచ్‌ఓ అభిప్రాయపడింది. అంతేకాకుండా, వ్యాక్సిన్‌ వాడటం వల్ల వెంటనే కరోనా వ్యాప్తి తగ్గుతుందనడానికి ఎటువంటి రుజువులు లేకపోవడంతో ప్రస్తుతం ప్రయాణికులకు వ్యాక్సిన్‌ను సిఫార్సు చేయడం లేదని నిపుణుల బృందం(SAGE) వెల్లడించింది. అయితే, ముప్పు పొంచి వున్న ప్రయాణికులకు మాత్రం వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని సూచించింది.

ఇకపోతే, మోడెర్నా వ్యాక్సిన్‌ రెండు డోసుల మధ్య 28రోజులు గడువు ఉండాలన్న విషయం తెలిసిందే. అయితే, ప్రత్యేక పరిస్థితుల్లో ఆరు వారాల వరకు ఈ గడువు పెంచవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం సూచించింది.

ఇవీ చదవండి..
టీకాపై వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలే: కేంద్రం
భారత్‌లో 20లక్షల మందికి టీకా


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని