ఎట్టకేలకు..ప్రారంభమైన కొవిడ్ మూలాల శోధన!

తాజా వార్తలు

Updated : 29/01/2021 06:24 IST

ఎట్టకేలకు..ప్రారంభమైన కొవిడ్ మూలాల శోధన!

వుహాన్‌లో పర్యటిస్తోన్న WHO నిపుణుల బృందం

బీజింగ్‌: చైనాలో కరోనా వైరస్‌ మూలాలను శోధించేందుకు వెళ్లిన ప్రపంచ ఆరోగ్య సంస్థ దర్యాప్తు బృందం ఎట్టకేలకు దర్యాప్తు ప్రారంభించింది. రెండు వారాల క్రితమే ఈ బృందం వూహాన్‌ చేరుకోగా, క్వారంటైన్‌ నిబంధనలతో 14రోజుల పాటు హోటల్‌కే పరిమితమైంది. తాజాగా ఆ గడువు ముగియడంతో కరోనా మూలాలపై దర్యాప్తును ప్రారంభమైంది.

అనుమానాలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో..
కరోనా వైరస్‌ తొలుత గబ్బిలాల నుంచే మానవులకు వ్యాపించినట్లు అంతర్జాతీయ నిపుణులు అనుమానిస్తున్నారు. కొవిడ్‌ మూలాలపై చైనా భిన్న వాదనలు వినిపిస్తోన్న చైనా, అంతర్జాతీయ దర్యాప్తునకు సహకరించలేదు. చైనా తీరుపై అమెరికా తొలినుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంది. తాజాగా కొత్తగా ఏర్పడిన బైడెన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కూడా కొవిడ్‌ మూలాలపై చైనా అసత్య వార్తలను ప్రచారం చేయవద్దని పేర్కొంది. కరోనా మూలాలపై ప్రపంచానికి నిజనిజాలు తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అమెరికా ప్రకటనపై ఆగ్రహించిన చైనా, వీటిపై దర్యాప్తు జరుపుతోన్న డబ్ల్యూహెచ్‌ఓ బృందం పనితీరును గౌరవించాలని తెలిపింది.

కొవిడ్‌ మూలల శోధన..
వుహాన్‌లో పర్యటిస్తోన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం కొవిడ్‌ మూలల శోధనలో భాగంగా సెమినార్లు, క్షేత్ర పర్యటనలు చేయనున్నట్లు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే, కరోనా వైరస్‌ తొలుత వ్యాపించినట్లు భావిస్తోన్న వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌ను ఈ బృందం పర్యటిస్తుందా? అన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇదే ల్యాబ్‌ నుంచి వైరస్‌ లీక్‌ అయినట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు పదే పదే ఆరోపించిన విషయం తెలిసిందే.

వుహాన్‌ వాసుల డిమాండ్‌తో ఉలిక్కిపడ్డ చైనా!
కరోనా వైరస్‌ విషయంలో చైనా మొదటి నుంచి ప్రపంచానికి సరైన సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి. వీటికి బలం చేకూర్చే సంఘటనలు కొద్ది రోజులుగా చైనాలో ఎక్కువయ్యాయి. కొవిడ్‌ మూలాలపై మాట్లాడిన జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను చైనా ప్రభుత్వం అణచివేస్తోందనే వాదనలూ ఉన్నాయి. ఈ సమయంలో డబ్ల్యూహెచ్‌ఓ బృందంతో సమావేశం అవుతామని కొవిడ్‌తో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేయడంతో చైనా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ బృందం వుహాన్‌ చేరుకున్నప్పటి నుంచి స్థానిక అధికారులు తమకు ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నారని బాధిత కుటుంబాలు ఆరోపించారు.

ఇలా ఎన్నో అవరోధాల నడుమ ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా మూలాలపై వుహాన్‌లో శోధన ప్రారంభించింది. దీంతో ఆ బృందం ఏం తేలుస్తుందనే విషయంపై యావత్‌ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.

ఇవీ చదవండి..
కొవిడ్‌ మూలాలు: ఏడాదైనా మిస్టరీగానే..!
కరోనా పోరులో సవాళ్లను అధిగమించాం: మోదీ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని