వ్యాక్సిన్‌ అనుమతిపై WHO ఏమందంటే..!

తాజా వార్తలు

Published : 04/01/2021 01:28 IST

వ్యాక్సిన్‌ అనుమతిపై WHO ఏమందంటే..!

వాషింగ్టన్‌: కరోనా వ్యాక్సిన్‌ కోసం భారత్‌తో పాటు యావత్‌ ప్రపంచ దేశాలు ఆశగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలోనే అత్యవసర వినియోగం కింద రెండు వ్యాక్సిన్‌లకు అనుమతి ఇస్తున్నట్లు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌లకు అనుమతిస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వాగతించింది. కరోనాపై చేస్తున్న పోరాటాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు కట్టడిని ఉద్ధృతం చేయడంలో భారత్‌ నిర్ణయం దోహదపడుతోందని డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయాసియా రీజినల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పూనమ్‌ కేత్రాపాల్‌ సింగ్‌ వెల్లడించారు. ప్రాధాన్యత కలిగిన ప్రజలకు వ్యాక్సిన్‌ అందించడం, ప్రజారోగ్య రక్షణ చర్యలు, ప్రజల భాగస్వామ్యాన్ని నిరంతరం అమలు చేయడం ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

ఇదిలాఉంటే, భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌కు అనుమతి ఇస్తున్నట్లు ఆదివారం ఉదయం డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా వీజీ సోమాని వెల్లడించారు. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ 70.42శాతం సమర్థత కలిగిన్నట్లు ఆయన తెలిపారు. విదేశాల్లో దాదాపు 23వేల మంది వాలంటీర్లపై ఆక్స్‌ఫర్డ్‌ జరిపిన టీకా ప్రయోగ వివరాలతో పాటు భారత్‌లో జరిపిన 1600 మంది వాలంటీర్ల సమాచారాన్ని విశ్లేషించినట్లు వెల్లడించారు. విదేశాల్లో జరిపిన ప్రయోగ ఫలితాలతో సమానంగా ఇక్కడ కూడా వ్యాక్సిన్‌ సమర్థత చూపించినట్లు పేర్కొన్నారు. ఇక మూడో దశ ప్రయోగాలు కొనసాగిస్తోన్న భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ కూడా సురక్షితంగానే ఉన్నట్లు నిపుణుల కమిటీ తెలిపిన విషయాన్ని సోమాని వెల్లడించారు. మొదటి, రెండో దశల్లో 800 వాలంటీర్లపై జరిపిన ప్రయోగాల వివరాలను ఆ సంస్థ నిపుణుల కమిటీ ముందు వివరించినట్లు చెప్పారు. ప్రస్తుతం కొవాగ్జిన్‌ టీకా మూడో దశ ప్రయోగాలను 25,800 మందిపై జరుపుతుండగా, ఇప్పటికే 22,500 మంది వాలంటీర్లు వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు డీసీజీఐ చీఫ్‌ ప్రకటించారు. వీరందరిలోనూ ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపించలేదని స్పష్టంచేశారు. వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చినప్పటికీ మూడో దశ ప్రయోగాలు మాత్రం కొనసాగుతాయని డీసీజీఐ తెలిపింది.

ఇవీ చదవండి..
భారత్‌లో టీకా వచ్చేసింది..
ప్రపంచాన్ని చుట్టేస్తున్న కొత్తరకం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని