భర్తల చెంతకు పాక్‌లోని భార్యలు!

తాజా వార్తలు

Published : 10/03/2021 11:56 IST

భర్తల చెంతకు పాక్‌లోని భార్యలు!

పాకిస్థాన్‌ యువతులను పెళ్లి చేసుకున్న ముగ్గురు రాజస్థాన్‌ యువకుల రెండేళ్ల ఎదురు చూపులకు సోమవారం తెరపడింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(మార్చి 8) సందర్భంగా వీరి భార్యలు సోమవారం రాత్రి అటారీ- వాఘా సరిహద్దు గుండా భారత్‌కు వచ్చారు. 2019లో వీరు వివాహం చేసుకున్న నెలరోజులకే పుల్వామా ఘటన జరిగింది. అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చి వీరి భార్యలకు వీసాలు మంజూరు కాలేదు. రాజస్థాన్‌కు 90 కిలోమీటర్ల దూరంలో ఉండే బాడ్మేర్, జైసల్మేర్‌కు చెందిన ముగ్గురు యువకులు 2019లో పాకిస్థాన్‌ సింధ్‌ రాష్ట్రంలోని యువతులను పెళ్లాడారు. నెలరోజుల పాటు అక్కడే ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఈ క్రమంలో పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వచ్చేందుకు ముగ్గురు యువకుల భార్యలకు ఇమిగ్రేషన్‌ అధికారులు వీసాలు మంజూరు చేయలేదు. దీంతో ఆ యువకులు భార్యలను అక్కడే ఉంచి స్వదేశానికి వచ్చేశారు. భార్యల వీసాల కోసం ముగ్గురు యువకులు రెండేళ్లుగా  ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు భారత విదేశీ వ్యవహారాల శాఖ చొరవ తీసుకుని వీరి భార్యలను రాజస్థాన్‌ చేర్చింది.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని