close

తాజా వార్తలు

Published : 09/03/2021 09:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘లక్షల ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడిస్తాం’

భోపాల్‌: నూతన సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయిత్‌ మరోమారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అవసరమైతే ఆ డిమాండ్‌ కోసం లక్షలాది ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో నిర్వహించిన భారీ ర్యాలీలో వెల్లడించారు.

‘మూడు సాగు చట్టాల రద్దు డిమాండ్‌ కోసం అవసరమైతే లక్షలాది ట్రాక్టర్లతో పార్లమెంటును ముట్టడిస్తాం. ఇప్పటికే గణతంత్ర దినోత్సవం రోజున 3,500 ట్రాక్టర్లతో దిల్లీలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అవన్నీ అద్దెకు తెచ్చిన ట్రాక్టర్లు కావు’ అని తికాయిత్‌ అన్నారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌ స్థానిక భాజపా నేత, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ పేరు ప్రస్తావించకుండా తికాయిత్‌ ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ‘మీరు ఎన్నుకున్న నాయకుడికి ఎలాంటి అధికారాలు లేవు. ఆయన సొంతంగా ఎప్పుడూ మనకు సమాధానం ఇవ్వలేరు. చర్చలకు సైతం ఫైల్స్‌ పట్టుకుని వచ్చి, వాటి ఆధారంగానే సమాధానాలు ఇస్తారు’ అని తికాయిత్‌ విమర్శలు చేశారు.

కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా గతేడాది నవంబర్‌ నుంచి దిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రాకేశ్‌ తికాయిత్‌ ఈ రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలు పర్యటించి రైతులతో సమావేశమవుతున్నారు. మధ్యప్రదేశ్‌ పర్యటనలో భాగంగా.. మార్చి 14న రెవా, మార్చి 15న జబల్‌పూర్‌ ప్రాంతాల్లోని రైతు ర్యాలీల్లో పాల్గొననున్నారని బీకేయూ మధ్యప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శి అనిల్‌ యాదవ్‌ తెలిపారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోనూ తికాయిత్‌ పర్యటించి రైతులతో సమావేశం కానున్నట్లు యాదవ్‌ వెల్లడించారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని