close

తాజా వార్తలు

Published : 19/01/2021 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

డేటింగ్‌ యాప్‌తో ఆందోళనకారుల్ని పట్టిస్తున్నారు!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ను అధికారికంగా ఖరారు చేయడానికి జనవరి 7న అమెరికా కాంగ్రెస్‌ సమావేశమైన విషయం తెలిసిందే. క్యాపిటల్‌ భవనంలో ఈ సమావేశం జరిగే వేళ ప్రస్తుత దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుగా కొందరు ఆందోళనకు దిగారు. ఏకంగా భవనంలోకి చొరబడి విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, బలగాలు రంగంలోకి దిగి.. పలువురు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆందోళనలో పాల్గొని టీవీల్లో కనిపించిన మరికొందరిని గుర్తించి అరెస్టు చేస్తున్నారు. ఈ విషయంలో సాయం చేయడం కోసం కొంతమంది మహిళలు డేటింగ్‌ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. క్యాపిటల్‌ ఆందోళనలో పాల్గొన్నవారిని యాప్‌లో గుర్తించి ఎఫ్‌బీఐకి సమాచారం ఇస్తున్నారట. ఓ మహిళ ఈ విషయాన్ని బయటపెట్టడంతో ఏకంగా ఆ డేటింగ్‌ యాప్ ఈ విషయంలో‌ చర్యలు తీసుకోవడం విశేషం.

కొంతమంది మహిళలు ‘బంబుల్‌’ అనే డేటింగ్‌ యాప్‌లో కావాలని తమ కంటెంట్‌ ప్రాధాన్యతను రాజకీయం విభాగానికి మార్చుకున్నారు. అనంతరం ఆ విభాగంలో వచ్చే వ్యక్తుల్ని పరిచయం చేసుకుంటున్నారు. ఎవరైనా తాము క్యాపిటల్‌ ఆందోళనలో పాల్గొన్నామని గొప్పగా చెప్పుకుంటూ ఫొటోలు, వీడియోలు పంపిస్తే.. వాటిని ఎఫ్‌బీఐకి పంపుతున్నారు. తనకు తెలిసిన ఓ మహిళ ఈ విధంగా ఆందోళనకారుల్ని డేటింగ్‌యాప్‌లో గుర్తించి ఎఫ్‌బీఐకి సమాచారం ఇస్తోందని అలిన్‌ అనే మహిళ ట్వీట్‌ చేయడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. క్యాపిటల్‌ భవనంలో విధ్వంసం సృష్టించిన వ్యక్తులు ఈ యాప్‌లో ఉన్నారని తెలియడంతో ‘అలాంటి వ్యక్తుల్ని మీ యాప్‌లో యూజర్లుగా ఉండనిస్తారా?’ అని బంబుల్‌‌ను నెటిజన్లు ప్రశ్నించడం మొదలుపెట్టారు. వారిని పట్టిస్తున్న మహిళలను అభినందిస్తున్నారు. 

దీంతో ఈ విషయంపై బంబుల్‌ యాజమాన్యం స్పందించింది. ‘చట్టవిరుద్ధ కంటెంట్‌ను బంబుల్‌ ఉపేక్షించదు. మా పాలసీని ఉల్లంఘించిన, క్యాపిటల్‌ ఆందోళనలో పాల్గొన్న యాప్‌ యూజర్ల అకౌంట్లను తొలగిస్తాం’అని ఇటీవల ఓ నెటిజన్‌ చేసిన ట్వీట్‌కు సమాధానం ఇచ్చింది. అలాగే, యాప్‌లో రాజకీయం విభాగాన్ని తాత్కాలికంగా తొలగించింది.

ఇదీ చదవండి..

పటిష్ఠ పహారాలో అమెరికా



Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని