Pakistan: అందుకు అమెరికాను అనుమతించబోం!
close

తాజా వార్తలు

Published : 20/06/2021 13:54 IST

Pakistan: అందుకు అమెరికాను అనుమతించబోం!

పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌

ఇస్లామాబాద్‌: అఫ్గానిస్థాన్‌పై చర్యలు చేపట్టేందుకు తమ సైనిక స్థావరాలు లేదా భూభాగాన్ని అమెరికా వినియోగించుకునేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ తెలిపారు. ఓ ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అల్‌ ఖైదా, ఐసిస్‌,  తాలిబన్‌పై ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకునేందుకు వీలుగా పాకిస్థాన్ భూభాగాన్ని అమెరికా వినియోగించుకునేందుకు అనుమతిస్తారా? అన్న ప్రశ్నకు ఆయన పై విధంగా బదులిచ్చారు.

పాక్‌ సైనిక స్థావరాల వినియోగానికి సంబంధించిన చర్చల్లో ప్రస్తుతం ప్రతిష్టంభన నెలకొందని అమెరికా అధికారులు చెప్పినట్లు న్యూయార్క్‌ టైమ్స్ ఇటీవల ఓ కథనం ప్రచురించింది. మరోవైపు ఈ మేరకు పాక్‌-అమెరికా మధ్య త్వరలోనే ఓ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని మరికొందరు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని