
తాజా వార్తలు
27 నగరాల్లో మెట్రో రైలు.. మోదీ
అహ్మదాబాద్: దేశంలోని 27 నగరాల్లో వెయ్యి కిలోమీటర్లకు పైగా నిడివిగల వివిధ మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ నేడు తెలిపారు. అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండో దశ, సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లకు నేడు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో రెండు ప్రధాన వాణిజ్య కేంద్రాలైన అహ్మదాబాద్, సూరత్‌ల్లో రవాణా సౌకర్యాలు మెరుగవుతాయన్నారు. మెట్రో ప్రాజెక్టు ఈ రెండు నగరాల ప్రజలకు పర్యావరణహిత ప్రజా రవాణా సాధనం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఒకప్పుడు దేశంలో మెట్రో రైలు అనే అలోచనే లేదని.. నేడు దేశంలో ప్రతి ప్రధాన నగరంలోనూ మెట్రో రైలు సదుపాయం రానుందని మోదీ అన్నారు. 2014కు ముందు దేశంలో కేవలం 225 కి.మీ మెట్రో రైలు మార్గం మాత్రమే అందుబాటులో ఉండేదని.. గత ఆరేళ్లలో 450 కి.మీ మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చిందని ప్రధాని వివరించారు.
ఇదీ చదవండి..
టీకా పంపిణీలో భారత్ ప్రపంచ రికార్డు