కొవిడ్‌ మూలాల అన్వేషణకు రాజకీయాలే అడ్డంకి

తాజా వార్తలు

Updated : 29/05/2021 15:09 IST

కొవిడ్‌ మూలాల అన్వేషణకు రాజకీయాలే అడ్డంకి

ప్రపంచ ఆరోగ్య సంస్థ అసహనం 

జెనీవా: కొవిడ్-19 మహమ్మారి మూలాలను వెలికితీసే ప్రయత్నాలకు రాజకీయాలు ఆటంకం కలిగిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ మిస్టరీని ఛేదించేందుకు శాస్త్రవేత్తల్ని తమపని తాము చేసుకోనివ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. 

‘సైన్స్‌ను రాజకీయాల నుంచి వేరుచేయమని మేం అడగాలనుకుంటున్నాం. సరైన దారిలో, సానుకూల వాతావరణంలో మనకు అవసరమైన సమాధానాలను కనుగొందాం. ఈ ప్రక్రియను రాజకీయాలు విషతుల్యం చేస్తున్నాయి’ అని ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీస్ డైరక్టర్ మైకేల్‌ ర్యాన్‌ హెచ్చరించారు. 

కరోనా మూలాలను అన్వేషించేందుకు సరికొత్త, లోతైన దర్యాప్తు జరపాలంటూ ఆరోగ్య సంస్థపై ఒత్తిడి పెరుగుతోంది. సరైన సమాధానం కోసం పలు దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచి లీక్ అయినట్లు మరోసారి అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. వాటి మూలాలపై నిగ్గు తేల్చాలని అమెరికా నిఘా విభాగాన్ని అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. జంతువుల నుంచి మానవులకు సోకిందా? లేక ల్యాబ్ నుంచి బయటకు వచ్చిందా? అనే విషయంపై మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే కరోనా వైరస్ నుంచి సంభవించిన మరణాల రేటు నుంచి దృష్టి మరల్చేందుకే అమెరికా ఇలాంటి కుట్రలు, రాజకీయాలు చేస్తోందని చైనా ఆరోపించింది. ఇక ఈ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా సృష్టిస్తోన్న విలయం కారణంగా.. 17కోట్లమందికి పైగా వైరస్ బారిన పడగా, 35లక్షల మందికి పైగా మృత్యు ఒడికి చేరుకున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని