Olympics: ప్రారంభ వేడుకలకు 15 దేశాల ప్రముఖులు

తాజా వార్తలు

Published : 21/07/2021 20:09 IST

Olympics: ప్రారంభ వేడుకలకు 15 దేశాల ప్రముఖులు

టోక్యో: శుక్రవారం జరగనున్న టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా 15 దేశాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. కరోనా దృష్ట్యా ప్రారంభ వేడుకలను వెయ్యి మందిలోపు అతిథులతోనే నిర్వహించాలని జపాన్ భావిస్తోంది. కొవిడ్‌ను నియంత్రించేందుకు నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో ఉంచుకొని ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకలకు హాజరయ్యే వారి సంఖ్యను పరిమితం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు జపాన్‌ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కట్సునోబూ కటో తెలిపారు. దాదాపు 70 మంది కేబినెట్‌ హోదా కలిగిన అధికారులు సైతం జపాన్‌కు వస్తారని పేర్కొన్నారు. అయితే వీఐపీల సంఖ్యపై అనిశ్చితి ఉందని వివరించారు. 

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌, మంగోలియా ప్రధాని ఓయూన్‌ ఎర్డెనే, అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ సహా పలువురు ఒలింపిక్స్‌ క్రీడల ప్రారంభ వేడుకలకు హాజరు కానున్నట్లు  కటో ప్రకటించారు. భారత్‌ నుంచి ఆరుగురు అధికారులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.  అయితే ప్రస్తుతం జపాన్‌లో కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో కొందరు ప్రముఖులు తమ పర్యటనను రద్దు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని