Mobile: ప్రపంచంలో ఎంతమంది ఫోన్లు వాడుతున్నారో తెలుసా..!

తాజా వార్తలు

Updated : 27/10/2021 15:15 IST

Mobile: ప్రపంచంలో ఎంతమంది ఫోన్లు వాడుతున్నారో తెలుసా..!

ఇంటర్నెట్‌డెస్క్‌: మన జీవితంలో నిత్యావసరాల జాబితాలో చేరిన మొబైల్‌ ఫోన్‌.. ఇప్పుడు కరోనా మహమ్మారి పుణ్యమా అని మనకు అత్యవసరంగా మారిపోయింది. ఆన్‌లైన్‌ క్లాసులు, వర్క్‌ ఫ్రమ్‌ హోంల వల్ల చిన్నా పెద్దా తేడా లేకుండా అందరి చేతుల్లోనూ ఫోన్లు కన్పిస్తున్నాయి. మరి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది మొబైల్‌ ఫోన్లు ఉపయోగిస్తున్నారో తెలుసా.. అక్షరాలా 529 కోట్ల మంది. ప్రపంచ మొత్తం జనాభాలో 65శాతానికి సమానంగా మొబైల్‌ ఫోన్‌ యూజర్లు ఉన్నట్లు తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. 

ప్రపంచవ్యాప్తంగా మొబైల్‌, ఇంటర్నెట్‌, సోషల్‌మీడియా వినియోగంపై ‘వి ఆర్‌ సోషల్‌’ అనే రీసెర్చి సంస్థ ఇటీవల ఓ అధ్యయనం చేపట్టి ‘డిజిటల్‌ 2021: అక్టోబరు గ్లోబల్‌ స్నాప్‌చాట్’ పేరుతో నివేదిక రూపొందించింది. దీని ప్రకారం, అక్టోబరు నాటికి 5.29 బిలియన్ల మంది మొబైల్‌ ఫోన్లను వినియోగిస్తున్నట్లు తేలింది. ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల మంది ఫోన్లను ఉపయోగిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఒక్క గతేడాదే దాదాపు 10కోట్ల మంది కొత్త యూజర్లు చేరినట్లు తెలిపింది. 

ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు 455కోట్ల మంది సోషల్‌మీడియాను వినియోగిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. గడిచిన 12 నెలల్లోనే సోషల్‌మీడియాను వినియోగించే వారి సంఖ్య 40 కోట్లు పెరిగిందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నిత్యం 10లక్షల మందికి పైగా కొత్తగా సామాజిక మాధ్యమాల్లో చేరుతున్నారని తెలిపింది. 2022 తొలి అర్ధభాగం నాటికి ప్రపంచ జనాభాలో 60శాతానికి పైగా ప్రజలు సోషల్‌మీడియాను వినియోగించే అవకాశముందని సంస్థ అంచనా వేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని