Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219009612
            [news_title_telugu_html] => 

ఇంగ్లీష్‌ ఛానల్‌ ఈదిన ఉదయ్‌పుర్‌ బాలిక

[news_title_telugu] => ఇంగ్లీష్‌ ఛానల్‌ ఈదిన ఉదయ్‌పుర్‌ బాలిక [news_title_english] => [news_short_description] => దక్షిణ ఇంగ్లండ్‌ నుంచి ఉత్తర ఫ్రాన్స్‌ వరకు ఉన్న ఇంగ్లీష్‌ ఛానల్‌ను రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌కు చెందిన పదహారేళ్ల గౌర్వీ సింఘ్వీ విజయవంతంగా ఈది రికార్డు సృష్టించింది.  40 కిలోమీటర్ల పొడవైన ఈ కాలవను [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,7, ) )
ఇంగ్లీష్‌ ఛానల్‌ ఈదిన ఉదయ్‌పుర్‌ బాలిక - EENADU
close
ఇంగ్లీష్‌ ఛానల్‌ ఈదిన ఉదయ్‌పుర్‌ బాలిక

రాజస్థాన్‌: దక్షిణ ఇంగ్లండ్‌ నుంచి ఉత్తర ఫ్రాన్స్‌ వరకు ఉన్న ఇంగ్లీష్‌ ఛానల్‌ను రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌కు చెందిన పదహారేళ్ల గౌర్వీ సింఘ్వీ విజయవంతంగా ఈది రికార్డు సృష్టించింది.  40 కిలోమీటర్ల పొడవైన ఈ కాలవను 13 గంటల 26 నిమిషాల్లోనే ఈదేసింది. ఈ సంవత్సరం భారత్‌ నుంచి ఇంగ్లీష్‌ ఛానల్‌ ఈదిన పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది. ‘‘భారతదేశంలో నేను ఈదేటప్పుడు ఎదుర్కొన్న ఆటంకాలు, ఇక్కడ ఎదుర్కొన్న ఆటంకాలు పూర్తిగా భిన్నమైవి. ఇక్కడ ఎండ ఎక్కువ. నీరు వేడిగా ఉంటుంది. నీటిలోని మురికితో వాంతులు రావడం, నూనె వాసనకు తల తిరగడం వంటి చాలా ఇబ్బందులు ఉన్నాయి’’ అని గౌర్వీ సింఘ్వీ చెప్పింది.  గతంలో ఆమె జుహు నుంచి గేట్‌ వే ఆఫ్‌ ఇండియా వరకు ఉన్న 22 కిలోమీటర్ల దూరాన్ని తొమ్మిది గంటల 22 నిమిషాల్లో ఈదింది. సముద్రంలో కొట్టే ఈతను జాతీయ సమాఖ్య అధికారికంగా గుర్తించనప్పటికీ.. తన ప్రయాణం కొనసాగుతుందని సింఘ్వీ స్పష్టం చేసింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.