close
గల్ఫ్‌కు మరిన్ని అమెరికా దళాలు

వాషింగ్టన్‌: సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలపై డ్రోన్‌ దాడుల నేపథ్యంలో గల్ఫ్‌ ప్రాంతానికి మరిన్ని సైనిక దళాలను పంపిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఈ దాడులకు ఇరాన్‌దే బాధ్యత అని ప్రకటిస్తూ ఆ దేశంపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించారు. ఇరాన్‌పై సైనిక దాడి చేసే ఉద్దేశమేమీ లేదని స్పష్టం చేశారు.

అమెరికాలో కాల్పులు: ఇద్దరు మృతి
అమెరికాలోని దక్షిణ కరోలినాలో ఒక నైట్‌ క్లబ్‌లో శనివారం గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా మరో 9మంది గాయపడ్డారు.

ట్రంప్‌ సర్కారుపై కోర్టుకు..
శాక్రమెంటో: తమ రాష్ట్రంలో కార్లు, ట్రక్కులకు గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాల, ఇంధన ప్రమాణాలను నిర్ణయించకుండా ట్రంప్‌ సర్కారును నిలువరించాలంటూ కాలిఫోర్నియా సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఇందుకు 22 రాష్ట్రాలు మద్దతు పలికాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.