close
తేజస్‌ రైలు ఆలస్యానికి రూ. 1.62 లక్షల పరిహారం

దిల్లీ: ప్రతిష్ఠాత్మకమైన తేజస్‌ రైళ్లు గంట కంటే ఆలస్యమైతే పరిహారం చెల్లిస్తామని ప్రకటించిన రైల్వే మాట నిలబెట్టుకొంది. ఈ నెల 19న లఖ్‌నవూ-దిల్లీ-లఖ్‌నవూ తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రెండు వైపులా ఆలస్యమయింది. ఉదయం 6.10 గంటలకు లఖ్‌నవూలో బయల్దేరాల్సిన రైలు 9.55కి బయల్దేరింది. దీంతో దిల్లీకి చేరడంలో, అక్కడి నుంచి బయల్దేరడంలో, మళ్లీ లఖ్‌నవూకు రావడంలోనూ ఆలస్యమయింది. ఆలస్యాన్ని బట్టి లఖ్‌నవూ-దిల్లీ రైల్లో 450 మందికి రూ.250 చొప్పున, దిల్లీ-లఖ్‌నవూ రైల్లో 500 మందికి రూ.100 చొప్పున మొత్తం రూ.1.62 లక్షలను బీమా సంస్థ ద్వారా ఐఆర్‌సీటీసీ చెల్లించనుందని రైల్వేశాఖ సోమవారం ప్రకటించింది. ఆలస్యానికిగానూ పరిహారమివ్వడం రైల్వే చరిత్రలో ఇదే తొలిసారి.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.