close

ప్రధానాంశాలు

మా అంతర్గత విషయంలో జోక్యం వద్దు

టర్కీ అధ్యక్షుడికి భారత్‌ సూచన

దిల్లీ: పాకిస్థాన్‌ పార్లమెంటులో ప్రసంగిస్తూ టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ కశ్మీర్‌ అంశంపై చేసిన వ్యాఖ్యల పట్ల భారత్‌ ఘాటుగా స్పందించింది. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఇక చాలించాలని ఆయనకు సూచించింది. జమ్మూ-కశ్మీర్‌ను ఉద్దేశించి ఎర్డోగాన్‌ వెల్లడించిన అభిప్రాయాలను ఖండిస్తున్నట్టు విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ శనివారం పేర్కొన్నారు. పాక్‌లో పర్యటిస్తున్న టర్కీ అధ్యక్షుడు శుక్రవారం ఆ దేశ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో మాట్లాడారు. జమ్మూ-కశ్మీర్‌ స్వతంత్ర ప్రతిపత్తి రద్దును ఉద్దేశిస్తూ- ‘‘కశ్మీర్‌ ప్రజలు దశాబ్దాల తరబడి ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవలి ఏకపక్ష నిర్ణయాలతో వారి బాధలు మరింత ఎక్కువయ్యాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.