close

ప్రధానాంశాలు

ప్రకటనలపై మీ సూచన ఆర్థిక కోతలతో సమానం

  తక్షణం వెనక్కి తీసుకోండి
  సోనియాగాంధీకి ఐఎన్‌ఎస్‌ విజ్ఞప్తి

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు రెండేళ్ల పాటు దినపత్రికలకు ప్రకటనలు ఇవ్వకుండా నిషేధం విధించాలన్న కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ సూచనను భారతీయ దినపత్రికల సంఘం (ది ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ-ఐఎన్‌ఎస్‌) ఖండించింది. ఈ ప్రతిపాదన ఆర్థిక కోతలతో (ఫైనాన్షియల్‌ సెన్సార్‌షిప్‌) సమానమని అభివర్ణించింది. ఉజ్వల, స్వేచ్ఛాయుత మీడియా ప్రయోజనాల దృష్ట్యా తక్షణం ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని కోరింది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలి ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐఎన్‌ఎస్‌ అధ్యక్షుడు శైలేష్‌ గుప్తా చెప్పారు.

సోనియాగాంధీ సూచనపై జాతీయ పాత్రికేయ సంఘాలూ గురువారం తీవ్ర ఆక్షేపణ వ్యక్తంచేశాయి. కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సూచన మీడియా పాత్రకు నష్టం చేకూర్చుతుందని, ఇలాంటి సలహా సోనియాగాంధీ నుంచి రావడం దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రెస్‌ అసోసియేషన్‌ (పీఏ), భారతీయ పాత్రికేయుల సంఘం (ఐజేయూ), జాతీయ పాత్రికేయుల సంఘం (ఎన్‌యూజే-ఐ), వర్కింగ్‌ న్యూస్‌ కెమెరామెన్స్‌ సంఘం (డబ్ల్యూఎన్‌సీఏ) ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. మరోవైపు, ద న్యూస్‌ బ్రాడ్‌క్యాస్టర్స్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీఏ) కూడా సోనియా సూచనపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.