close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సరిహద్దు వివాదంపై సుదీర్ఘ చర్చలు

దిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌, చైనా సైన్యాలు మంగళవారం మూడో విడత చర్చలు జరిపాయి. లెఫ్టినెంట్‌ జనరల్‌ హోదా అధికారుల స్థాయిలో జరిగిన ఈ భేటీలో.. ఇరు పక్షాల మధ్య ఘర్షణలకు కేంద్రబిందువుగా ఉన్న ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణకు విధివిధానాలను ఖరారు చేయడంపై దృష్టి పెట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చుషుల్‌ సెక్టార్‌లోని భారత భూభాగంలో ఈ చర్చలు జరిగాయి.

వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)కి సంబంధించి చైనా కొత్త వాదనలు వినిపించడంపై ఈ భేటీలో భారత పక్షం ఆందోళన వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. గల్వాన్‌ లోయ, పాంగాంగ్‌ సరస్సు, ఇతర ప్రాంతాల్లో యథాపూర్వ స్థితిని పునరుద్ధరించాల్సిందేనని, చైనా బలగాలు వెనక్కి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసినట్లు సమాచారం. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ చర్చలు రాత్రి పొద్దుపోయాక కూడా కొనసాగుతున్నట్లు సమాచారం.

భారత సైనికుల మరణంపై ఫ్రాన్స్‌ మంత్రి సంతాపం
గల్వాన్‌ లోయలో జరిగిన సరిహద్దు ఘర్షణల్లో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు చనిపోవడంపై ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫ్లారెన్స్‌ పార్లి సంతాపం తెలిపారు. ఈ మేరకు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు ఆమె లేఖ రాశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.