close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రూ.10 వేల కోట్లతో నౌకాశ్రయం

గ్రేట్‌ నికోబార్‌ దీవిలో ఏర్పాటు చేస్తాం: మోదీ

దిల్లీ: గ్రేట్‌ నికోబార్‌ దీవిలో రూ.10 వేల కోట్లతో భారీ నౌకాశ్రయాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. చెన్నై, అండమాన్‌ నికోబార్‌ దీవులను కలుపుతూ సముద్రంలోంచి వేసిన 2,312 కిలోమీటర్ల ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ప్రాజెక్టును సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా  మోదీ మాట్లాడుతూ.. గ్రేట్‌ నికోబార్‌ దీవిలో ప్రతిపాదిత పోర్టు నిర్మాణం పూర్తయితే భారీ నౌకల మరమ్మతులకు అండమాన్‌ దీవులు కేంద్రమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సముద్ర వ్యాపారంలో భారత్‌ పాత్ర కూడా గణనీయంగా పెరుగుతుందని, స్థానిక ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మోదీ అభిలషించారు. ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ప్రాజెక్టు సకాలంలో పూర్తయినందుకు సంతోషం వ్యక్తం చేసిన మోదీ.. దీని ద్వారా అండమాన్‌ ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.

అంతకు ముందు ఆయన ఆరు వరద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులతో  వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలోని వరదల పరిస్థితిని ఆయన సమీక్షించారు. వరదల రాకను అంచనా వేసే శాశ్వత వ్యవస్థలను ఏర్పరచడానికి మరింత సమన్వయంతో కేంద్ర, రాష్ట్రాలు పని చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వాతావరణ సూచనలు, హెచ్చరికల జారీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని సూచించారు. వరద హెచ్చరికలను జారీ చేసే వ్యవస్థను ఆధునికీకరించాలని. వీలైనంత ఎక్కువ చోట్ల ఈ సాధనాలను వాడాలని ముఖ్యమంత్రులకు ప్రధాని సూచించారు. దీనివల్ల బాధితులు తొందరగా సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లే అవకాశముంటుందని అన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.