close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ఎలా సేకరిద్దాం?

ఎలా పంపిణీ చేద్దాం...
తొలిసారి సమావేశమైన నిపుణుల బృందం
రాష్ట్రాలు సేకరించొద్దని సూచన

దిల్లీ: ప్రపంచమంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న కొవిడ్‌-19 వ్యాక్సిన్లు ఒకొక్కటిగా క్లినికల్‌ పరీక్షలను పూర్తిచేసుకుంటున్న తరుణంలో... వాటి సేకరణ-పంపిణీపై చర్చించేందుకు జాతీయ నిపుణుల బృందం తొలిసారిగా బుధవారమిక్కడ సమావేశమైంది. దేశ విదేశాల్లో తయారవుతున్న ఈ వ్యాక్సిన్లను ఏ విధానంలో కొనుగోలు చేయాలి? వాటిని దేశ వ్యాప్తంగా ఎలా పంపిణీ చేయాలి? ఏయే ప్రాధాన్య క్రమంలో ప్రజలకు వాటిని అందించాలి? అన్న విషయాలపై లోతుగా చర్చించింది. నీతీ ఆయోగ్‌ సభ్యుడు డా.వీకే పాల్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

దేశ పరిస్థితులకు అనువైన వ్యాక్సిన్లను ఎంపిక చేయాలంటూ, ఇందుకు అవసరమైన ప్రమాణాలు, మార్గదర్శకాల రూపకల్పనపై బృందం చర్చించింది. ఈ మేరకు జాతీయ ఇమ్యునైజేషన్‌ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టీఏజీఐ) నుంచి సలహాలు కోరింది. పెద్ద మొత్తంలో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసేందుకు ఎంత మేర ఆర్థిక వనరులు అవసరమవుతాయి, వాటిని ఏయే మార్గాల్లో సేకరించవచ్చు అన్నది కూడా ప్రస్తావనకు వచ్చింది. అయితే... వేర్వేరు మార్గాల్లో వ్యాక్సీన్ల కొనుగోలు/సేకరణ చేపట్టవద్దని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ బృందం సూచించింది.

అల్ప, మధ్య ఆదాయ దేశాలకూ...
ఈ సమావేశ వివరాల గురించి ఆరోగ్యశాఖ అధికారులు మాట్లాడుతూ ‘‘చివరి మైలు వరకూ వ్యాక్సిన్‌ సరఫరా ప్రక్రియను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం సహా... ఇందుకు అవసరమైన పంపిణీ-నిర్వహణ వ్యవస్థకు డిజిటల్‌ వసతులను సమకూర్చడంపైనా నిపుణుల బృందం చర్చించింది. వ్యాక్సిన్‌ భద్రత, నిఘా, సమాచారాన్ని పారదర్శకంగా అందుబాటులో ఉంచడం, ప్రజలకు అవగాహన కల్పించడంపై లోతుగా చర్చ జరిగింది. దేశీయంగా కొవిడ్‌-19 వ్యాక్సిన్ల తయారీ సామర్థ్యాన్ని భారత్‌ పెంపొందించడమే కాకుండా... అంతర్జాతీయ పోటీదారులతో కలిసి అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో వ్యాక్సిన్లను త్వరితగతిన పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కమిటీ పేర్కొంది’’ అని తెలిపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.