close

ప్రధానాంశాలు

Published : 18/10/2020 05:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆకలిచావుల దిశగా 27 కోట్ల జనం

 ప్రపంచాన్ని కుదిపేసిన కొవిడ్‌ మహమ్మారి
 ధనవంతులు దాతృత్వం చాటాల్సిన తరుణం
 నోబుల్‌ శాంతి బహుమతి పొందిన సంస్థ పిలుపు

ఐక్యరాజ్యసమితి: ‘ప్రపంచంలో తినడానికి తిండి లేక ఆకలిచావుల దిశగా సాగుతున్న జనం కొవిడ్‌-19 కారణంగా రైట్టింపై 13.5 కోట్ల నుంచి 27 కోట్లకు పెరిగారు. మానవత్వం మీ సాయం కోరుతోంది. ఇపుడు ప్రపంచం మొత్తం ఓ కూడలికి చేరింది. అన్నార్తులను ఆదుకుందాం. ధనవంతులు ఉదారంగా ముందుకువచ్చి పేదలకు ఆపన్నహస్తం అందించాలి’ అని ప్రపంచ ఆహార కార్యక్రమం అధినేత, ఈ ఏడాది నోబుల్‌ శాంతి బహుమతి పొందిన సంస్థ ప్రతినిధి డేవిడ్‌ బీస్లే అభ్యర్థించారు. ఐక్యరాజ్య సమితి ఆహార ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శుక్రవారం ఆన్‌లైన్‌లో పత్రికా సమావేశం ద్వారా మాట్లాడుతూ.. ఈ సంక్షోభ సమయంలో కొంతమంది కుబేరుల సంపద మటుకు బాగా పెరిగిందన్నారు. మీ నుంచి మరీ ఎక్కువ సాయం కోరడం లేదు. ఈ ఏడాది చాలా ప్రభుత్వాలు ఆర్థికసంక్షోభంలో కూరుకుపోయాయి. తలో చేయి వేసి ఆదుకుందాం’ అని ఆయన పిలుపునిచ్చారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.