ఇలా పదవి.. అలా రాజీనామా!

ప్రధానాంశాలు

Published : 20/11/2020 05:49 IST

ఇలా పదవి.. అలా రాజీనామా!

4 రోజులకే వైదొలగిన బిహార్‌ మంత్రి మేవాలాల్‌
అవినీతి ఆరోపణలే కారణం

పట్నా: ప్రమాణస్వీకారం చేసిన 4 రోజులకే బిహార్‌ మంత్రి ఒకరు రాజీనామా చేశారు. కొత్తగా కొలువుదీరిన నీతీశ్‌ కుమార్‌ మంత్రివర్గంలో మేవాలాల్‌ చౌధురీకి విద్యాశాఖను కేటాయించారు. సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన ఆయనకు మంగళవారమే శాఖను కేటాయించారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బాధ్యతలు చేపట్టిన ఆయన కొద్ది సేపటికే పదవి నుంచి వైదొలగడం గమనార్హం. సీఎం నీతీశ్‌ కుమార్‌ నేతృత్వం వహిస్తున్న జేడీయూ పార్టీకి చెందిన మేవాలాల్‌ గతంలో బిహార్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీగా పనిచేసిన సమయంలో బోధన, సాంకేతిక సిబ్బంది నియామకంలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారంపై 2017లో కేసు నమోదుకాగా ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరుంది. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రిపదవి ఇవ్వడంపై విపక్షాలు తీవ్రస్థాయిలో దుయ్యబట్టాయి. దీంతో గురువారం నీతీశ్‌తో భేటీ అయిన మేవాలాల్‌ వెంటనే రాజీనామా సమర్పించగా గవర్నర్‌ ఆమోదించారు. అనంతరం జేడీయూకే చెందిన మరో మంత్రి అశోక్‌ చౌధరీకి విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన