close

ప్రధానాంశాలు

Published : 03/12/2020 05:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విడుదలకు శశికళ దరఖాస్తు

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: అక్రమ ఆస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలి శశికళ తనను త్వరగా విడుదల చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. కోర్టు శిక్ష ప్రకారం 2021 జనవరి 27న ఆమె విడుదల కావాలి. తాను చెల్లించిన రూ.10 కోట్ల జరిమానా, సత్ప్రవర్తన కారణంగా త్వరగా విడుదలయ్యే అవకాశాలను పరిశీలించాలని ఆమె కారాగార అధికారులకు విన్నవించుకున్నారు. సత్ప్రవర్తన కారణంగా ప్రతి నెలా మూడు రోజులు శిక్షా కాలం నుంచి మినహాయిస్తారు. ఇప్పటికే 43 నెలల శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్న శశికళ 135 రోజుల సత్ప్రవర్తన దినాలను మినహాయిస్తే నిర్దేశిత సమయం కంటే ముందుగానే విడుదలయ్యే వీలుంది. శశికళ దరఖాస్తును కారాగార ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన