
ప్రధానాంశాలు
నూతన వ్యవసాయ చట్టాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి
ఈనాడు, దిల్లీ: దేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేలా ఉన్న నూతన వ్యవసాయ చట్టాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పలు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. కేంద్రం తీసుకువచ్చిన ఆ చట్టాలపై ఆందోళన చేపడుతున్న రైతులకు సంఘీభావంగా వారు బుధవారం ఆన్లైన్ సదస్సు నిర్వహించారు. ప్రముఖ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్ మాట్లాడుతూ స్వామినాథ్ కమిషన్ నివేదిక ఇచ్చి 15 ఏళ్లవుతున్నా కేంద్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ప్రస్తుత ప్రభుత్వం వేసిన అయిదుగురు సభ్యుల కమిటీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే మాట్లాడుతూ ప్రస్తుత చట్టాలతో రేషన్ వ్యవస్థ పూర్తిగా కనుమరుగై పేదలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సంస్థకు చెందిన రామకుమార్ మాట్లాడుతూ రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్రం ఏకపక్షంగా వ్యవసాయ చట్టాలు చేయడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు.
బ్రిటన్ సిక్కు నేతల మద్దతు
లండన్: రైతుల ఆందోళనకు బ్రిటన్ సిక్కు రాజకీయనాయకులు మద్దతు పలికారు. బ్రిటన్ లేబర్ పార్టీకి చెందిన వీరేంద్ర శర్మ.. సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిష్కారం కనుగొనాలని సూచించారు. లేబర్ పార్టీకి చెందిన ప్రీత్ కౌర్ గిల్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. నిరసన గళాన్ని అణచివేసేందుకు జల ఫిరంగులు, భాష్ప వాయువును ప్రయోగిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రధానాంశాలు
సినిమా
- మూఢత్వమే ప్రాణాలు తీసింది!
- 16 మంది మహిళలను చంపిన సైకో!
- బదిలీల ప్రతిపాదన తిరస్కరించిన ఎస్ఈసీ
- ‘పంత్ వ్యూహం’ కోహ్లీదే
- మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
- 12 మందితో లంక ఆట: ఐసీసీ సీరియస్!
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?
- మరో 30ని. క్రీజులో ఉంటే 3-1గా మారేది: పంత్
- కేదార్‌ను ధోనీ కొనసాగించేవాడు..కానీ: గంభీర్
- సుప్రీం తీర్పు: ఎస్ఈసీకి ఏపీ ప్రభుత్వ సహకారం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
