
ప్రధానాంశాలు
ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలకు ఈపీఎఫ్ చట్ట నిబంధనలు వర్తిస్తాయి
సుప్రీంకోర్టు
దిల్లీ: తమ క్లయింట్లకు సిబ్బందిని సమకూర్చే ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలకు ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) చట్ట నిబంధనలు వర్తిస్తాయని సుప్రీంకోర్టు తెలిపింది. అపీలుదారైన కంపెనీ సుశిక్షితులైన, నైపుణ్యం గలిగిన సెక్యూరిటీ గార్డులను తన క్లయింట్లను సమకూర్చినందుకు గాను తగిన మొత్తాన్ని పొందుతుందని పేర్కొంది. తాము కేవలం కాపలాదారులను సమకూర్చే పనిని మాత్రమే చేస్తున్నామన్న పంథేర్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాదనను జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ సూర్య కాంత్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీల(నియంత్రణ) చట్టం-2005 ప్రకారం ఆ కంపెనీ సంబంధిత సెక్యూరిటీ గార్డులకు యజమానిగా కొనసాగుతూ వారికి వేతనాలను చెల్లిస్తుందని తెలిపింది ‘‘ఒప్పందంలో భాగంగా సిబ్బందిని సమకూర్చినందుకు గాను క్లయింట్ల నుంచి సెక్యూరిటీ ఏజెన్సీ నగదును పొందుతూ, గార్డులకు వేతనాలను చెల్లిస్తుంది. ఇక్కడ క్లయింట్లు సిబ్బందికి యజమానులుగా లేరు. అలాగే సిబ్బంది కూడా క్లయింట్లు నియమించుకున్న ఉద్యోగులు కాదు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈపీఎఫ్ చట్టానికి అనుగుణంగా ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ కొనసాగుతున్నట్లయితే ...ఆ చట్ట నిబంధనలు దానికి వర్తిస్తాయని సుప్రీంకోర్టు తెలిపింది. క్లయింట్లకు కాపలాదారులను సమకూర్చినందుకు గాను సర్వీసు రుసుములను మాత్రమే తీసుకుంటున్నామని, సిబ్బందికి వేతనాలను క్లయింట్లే చెల్లిస్తున్నారని కంపెనీ వాదించింది. ఈపీఎఫ్ చట్టం తమకు వర్తించదని పేర్కొంది.
ప్రధానాంశాలు
సినిమా
- మూఢత్వమే ప్రాణాలు తీసింది!
- 16 మంది మహిళలను చంపిన సైకో!
- బదిలీల ప్రతిపాదన తిరస్కరించిన ఎస్ఈసీ
- ‘పంత్ వ్యూహం’ కోహ్లీదే
- మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
- 12 మందితో లంక ఆట: ఐసీసీ సీరియస్!
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?
- మరో 30ని. క్రీజులో ఉంటే 3-1గా మారేది: పంత్
- మా చేతులతో మేమే చంపుకొన్నామే..
- కేదార్‌ను ధోనీ కొనసాగించేవాడు..కానీ: గంభీర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
