
ప్రధానాంశాలు
అధికారం చేపట్టగానే ఆర్థికంపై దృష్టి
సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు తొలిరోజు నుంచే కృషి చేస్తాం: కమలా హారిస్
వాషింగ్టన్: అధికారం చేపట్టిన తొలిరోజు నుంచే దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపడతామని అమెరికా నూతన ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ పేర్కొన్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఎంచుకున్న అనుభవజ్ఞులైన ఆర్థిక సలహాదారుల బృందం అందుకు దన్నుగా నిలుస్తుందని తెలిపారు. బైడెన్ బుధవారం డేలావేర్‌లోని విల్మింగ్టన్లో జరిగిన ఓ కార్యక్రమంలో తన ఆర్థిక సలహాదారుల బృందాన్ని పరిచయం చేశారు. ఆర్థిక మంత్రిగా ఎంచుకున్న జానెట్ యెల్లెన్, డైరెక్టర్ ఆఫ్ ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్‌గా ఎంపికైన ఇండో అమెరికన్ నీరా టాండన్ తదితరులు ఆ బృందంలో ఉన్నారు. ఈ సందర్భంగా కమల మాట్లాడుతూ ‘‘బైడెన్, నేను ఈ బృందంతో కలసి తక్షణం ఆర్థిక రంగాన్ని మళ్లీ పట్టాలెక్కించే దిశగా కృషి చేస్తాం. ఈ సంక్షోభ సమయంలో అది అత్యవసరమైన చర్య. అమెరికా ప్రజలకు ఆర్థిక ఉపశమనం కలిగించే దిశగా ఈ బృందం పనిచేస్తుంది’’ అని పేర్కొన్నారు. కనీస వేతనం పెంపుదల, అందరికీ ఆరోగ్య భద్రత కల్పించడానికి తమ యంత్రాంగం పాటుపడుతుందని తెలిపారు. అందరూ సొంత ఇల్లు నిర్మించుకోవడానికి, చిన్న వ్యాపారాలకు మూల ధనం అందించడానికి సహకారం అందిస్తామని చెప్పారు. శ్రామిక వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
భారతీయ అమెరికన్‌కు ప్రమాణ స్వీకార ఏర్పాట్ల బాధ్యతలు
వాషింగ్టన్: బైడెన్ బృందంలో మరో భారతీయ అమెరికన్‌కు కీలక స్థానం లభించింది. జనవరి 20న జరగనున్న బైడెన్-కమలా హారిస్‌ల ప్రమాణ స్వీకారోత్సవానికి అధికారిక ఏర్పాట్లు చేసే కార్యనిర్వాహక కమిటీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మజు వర్ఘెసెను బైడెన్ నియమించారు. ఈ కమిటీకి సీఈవోగా టోనీ అలెన్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఎరిన్ విల్సన్, యవన్నా కన్సేలా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా ఈ కమిటీలో చోటు దక్కడం గౌరవంగా భావిస్తున్నానని మజు వర్ఘెసె పేర్కొన్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజారోగ్యాన్ని పరిరక్షించేలా పలు జాగ్రత్తలు తీసుకుంటూ, దేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతుండటం ఆనందంగా ఉందని వర్ఘెసె తెలిపారు. ఆయన బైడెన్-హారిస్ ఎన్నికల ప్రచార బృందంలో ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. న్యాయవాది అయిన వర్ఘెసె ఒబామా ప్రభుత్వంలో వివిధ ఉన్నత స్థానాల్లో పనిచేశారు. ఆయన తల్లిదండ్రులు కేరళ నుంచి అమెరికాకు వలస వెళ్లారు.
ప్రధానాంశాలు
సినిమా
- మూఢత్వమే ప్రాణాలు తీసింది!
- 16 మంది మహిళలను చంపిన సైకో!
- బదిలీల ప్రతిపాదన తిరస్కరించిన ఎస్ఈసీ
- ‘పంత్ వ్యూహం’ కోహ్లీదే
- మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
- 12 మందితో లంక ఆట: ఐసీసీ సీరియస్!
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?
- మరో 30ని. క్రీజులో ఉంటే 3-1గా మారేది: పంత్
- మా చేతులతో మేమే చంపుకొన్నామే..
- కేదార్‌ను ధోనీ కొనసాగించేవాడు..కానీ: గంభీర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
