close

ప్రధానాంశాలు

Published : 03/12/2020 05:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాల ఉత్పత్తుల తయారీకి రసాయనాల వాడకం

ఇండోర్‌లో డెయిరీ యజమాని అరెస్టు

ఇండోర్‌: జున్ను తదితర పాల ఉత్పత్తులను తయారు చేసేందుకు పాలల్లో ఎసిటిక్‌ ఆమ్లం కలుపుతున్నారన్న ఆరోపణలో ఇండోర్‌కి చెందిన డెయిరీ యజమాని ఒకరు బుధవారం అరెస్టయ్యాడు. కఠిన జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ) కింద నిందితుడిపై కేసు నమోదయింది. పోలో గ్రౌండ్‌ పారిశ్రామిక ప్రాంతానికి సమీపంలోనున్న రెండు డెయిరీల నుంచి 99 శాతం గాఢత గల 70 లీటర్ల ఎసిటిక్‌ ఆమ్లాన్ని మంగళవారం జరిపిన సోదాల్లో స్వాధీనం చేసుకున్నట్లు అదనపు జిల్లా కలెక్టరు అభయ్‌ బేదేకర్‌ చెప్పారు. అనంతరం పాలనా యంత్రాంగం ఆదేశాల మేరకు ఎన్‌ఎస్‌ఏ కింద డెయిరీ యజమాని తికందాస్‌ ఠడానీని అరెస్టు చేసి, కేంద్రీయ కారాగారానికి పంపినట్లు పోలీసులు తెలిపారు. పాలను గడ్డకట్టించేందుకు ఎసిటిక్‌ ఆమ్లాన్ని వాడటం నిషేధమని వారు చెప్పారు. మరో డెయిరీ యజమాని పరారీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన