
ప్రధానాంశాలు
బ్రిటిష్ ఇండియన్ రచయిత్రికి హెజెల్ టిల్ట్‌మన్ బహుమతి
జలియన్‌వాలా బాగ్ చారిత్రక ఘటనపై పుస్తకాన్ని రచించిన అనితా ఆనంద్
లండన్: బ్రిటిష్ ఇండియన్ రచయిత్రి అనితా అనంద్‌ను ప్రతిష్ఠాత్మక ‘హెజెల్ టిల్ట్‌మన్ బహుమతి’ వరించింది. భారత్‌లో జరిగిన జలియన్‌వాలా బాగ్ ఘటనపై రచించిన పుస్తకం గొప్ప చారిత్రక రచనగా ఎంపికవడంతో ఆమెకు ఈ గౌరవం దక్కింది. ఆమె రచించిన ‘ది పేషెంట్ అసాసిన్: ఎ ట్రూ టేల్ ఆఫ్ మాసకర్’ను వాస్తవిక చారిత్రక నేపథ్యం ఉన్న పుస్తకంగా ఆవార్డు కమిటీ న్యాయనిర్ణేతలు అభివర్ణించారు. ఈ బహుమతి దక్కడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బహుమతి రూపంలో ఆమెకు 2 వేల పౌండ్లు(సుమారు రూ.2 లక్షలు) దక్కనున్నాయి. ‘‘ఈ పుస్తకం.. అమృత్‌సర్‌లో 1919లో జలియన్‌వాలా బాగ్‌లో జరిగిన దారుణ మారణహోమానికి సంబంధించి.. ఓ హంతకుడికి, ఓ బాధితుడికి మధ్య జరిగిన కథ. దానికి బాధ్యుడైన ఓ బ్రిటిష్ అధికారిపై.. ఆ ఘటన జరిగిన రెండు దశాబ్దాల తర్వాత ఆ బాధితుడు పగ తీర్చుకున్న కథ. అంతకు మించి ఇద్దరు వ్యక్తుల కథ’’ అని న్యాయనిర్ణేతల్లో ఒకరైన రాణా మిట్టర్ తెలిపారు.
ప్రధానాంశాలు
సినిమా
- మూఢత్వమే ప్రాణాలు తీసింది!
- 16 మంది మహిళలను చంపిన సైకో!
- ‘పంత్ వ్యూహం’ కోహ్లీదే
- బదిలీల ప్రతిపాదన తిరస్కరించిన ఎస్ఈసీ
- మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
- 12 మందితో లంక ఆట: ఐసీసీ సీరియస్!
- మరో 30ని. క్రీజులో ఉంటే 3-1గా మారేది: పంత్
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?
- కేదార్‌ను ధోనీ కొనసాగించేవాడు..కానీ: గంభీర్
- సుప్రీం తీర్పు: ఎస్ఈసీకి ఏపీ ప్రభుత్వ సహకారం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
