close

ప్రధానాంశాలు

Published : 03/12/2020 05:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహారాష్ట్రలో దావూద్‌ ఆస్తుల వేలం

ముంబయి: మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలోని అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు సంబంధించిన ఆస్తులను వేలం వేయగా.. అవి రూ.1.10 కోట్ల ధరకు అమ్ముడుపోయాయి. ఈ మేరకు అధికారులు బుధవారం వెల్లడించారు. ‘‘స్మగ్లర్స్‌ అండ్‌ ఫారిన్‌ ఎక్స్‌చేంజ్‌ మేనిప్యులేటర్స్‌ యాక్ట్‌(ఎస్‌ఏఎఫ్‌ఈఎమ్‌ఏ) కింద అతడి ఆస్తులను ఈ వారం ప్రారంభంలో వేలం వేసినట్లు వివరించారు. అవి జాతీయ రహదారికి సమీపంలో ఉన్నాయన్నారు. వీటితోపాటు దావూద్‌కి సంబంధించి ఇంకా ఐదు ఆస్తులకు వేలం నిర్వహించాల్సి ఉండగా.. పలు సాంకేతిక కారణాల వల్ల వేలం వేయలేదని తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన