
ప్రధానాంశాలు
శబరిమల అయ్యప్ప దర్శనం ఇకపై రోజుకు 2 వేల మందికి
శబరిమల: అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. ఇకపై రోజుకు 2 వేల మంది భక్తులను స్వామి దర్శనానికి అనుమతించనుంది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటివరకు సాధారణ దినాల్లో రోజుకు వెయ్యి మందిని, శని, ఆదివారాల్లో రోజుకు 2 వేల మందిని దర్శనానికి అనుమతిస్తున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం సాధారణ రోజుల్లో రోజుకు 2 వేల మందిని, శని, ఆదివారాల్లో రోజుకు 3 వేల మందిని అనుమతించనున్నారు. దర్శనానికి వచ్చే భక్తులు ఆన్లైన్లోనే టికెట్లు తీసుకొని రావాలని మంత్రి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కరోనా నేపథ్యంలో అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని భక్తులకు సూచించారు. కొవిడ్ నెగెటివ్ అని తెలిపే ధ్రువపత్రాలను సమర్పించిన వారినే దర్శనానికి అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం సన్నిధానం, పంబ వైద్య శిబిరాల వద్ద 14 రోజుల ముందు నుంచి విధులు నిర్వర్తిస్తున్న పలు విభాగాలకు చెందిన సిబ్బందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు. రోజుకు సుమారు 200 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు వివరించారు. నవంబరు 16న ఆలయం తెరిచిన నాటి నుంచి 27 వరకు చేసిన పరీక్షల్లో యాత్రికులు, పోలీసులు, ఆలయ సిబ్బందిలో 39 మందికి కొవిడ్ సోకినట్లు స్పష్టం చేశారు. ఈ నెల 26న మండల పూజ, జనవరి 14న మకరవిళక్కు(మకర జ్యోతి దర్శనం) ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు. జనవరి 20న ఆలయాన్ని మూసివేయనున్నట్లు పేర్కొన్నారు.
ప్రధానాంశాలు
సినిమా
- మూఢత్వమే ప్రాణాలు తీసింది!
- 16 మంది మహిళలను చంపిన సైకో!
- బదిలీల ప్రతిపాదన తిరస్కరించిన ఎస్ఈసీ
- ‘పంత్ వ్యూహం’ కోహ్లీదే
- మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
- 12 మందితో లంక ఆట: ఐసీసీ సీరియస్!
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?
- మరో 30ని. క్రీజులో ఉంటే 3-1గా మారేది: పంత్
- కేదార్‌ను ధోనీ కొనసాగించేవాడు..కానీ: గంభీర్
- సుప్రీం తీర్పు: ఎస్ఈసీకి ఏపీ ప్రభుత్వ సహకారం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
