ఉగ్ర పడగ తొలగిపోతేనే.. సార్క్‌ దేశాల్లో ప్రగతి పరుగులు: మోదీ

ప్రధానాంశాలు

Published : 09/12/2020 04:45 IST

ఉగ్ర పడగ తొలగిపోతేనే.. సార్క్‌ దేశాల్లో ప్రగతి పరుగులు: మోదీ

దిల్లీ: ఉగ్రవాదం, హింసకు తావులేని వాతావరణంలోనే సార్క్‌ దేశాలు పూర్తి సామర్థ్యాలను వినియోగించుకొని అభివృద్ధి సాధించగలవని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ముష్కర మూకల్ని పెంచి పోషిస్తున్న, వాటికి మద్దతిస్తున్న శక్తులను సమష్టిగా ఓడించాలన్నారు. అందరం కలిసికట్టుగా నిలబడి సుసంపన్నమైన, సురక్షితమైన దక్షిణాసియాను నిర్మించుకుందామని సూచించారు. ఈ ప్రాంత ఆర్ధిక, సామాజిక, శాస్త్ర సాంకేతికాభివృద్ధికి భారత్‌ పూర్తి నిబద్ధతను కలిగిఉందని దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంస్థ (సార్క్‌) 36వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంగళవారం వెలువరించిన సందేశంలో ఆయన పేర్కొన్నారు. సార్క్‌ సభ్య దేశాలు త్వరలో సమావేశం కావాలన్న ఆకాంక్షను నేపాల్‌ ప్రధాని కె.పి.ఓలి వ్యక్తం చేశారు. సార్క్‌లో భారత్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, మాల్దీవులు, నేపాల్‌, పాకిస్థాన్‌, శ్రీలంక సభ్య దేశాలుగా ఉన్నాయి. రెండేళ్లకోసారి జరగాల్సిన సార్క్‌ శిఖరాగ్ర సదస్సులు 2014 తర్వాత నుంచి నిలిచిపోయాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన