పాక్‌ అదుపులో గుజరాత్‌ మత్స్యకారులు!

ప్రధానాంశాలు

Published : 09/12/2020 04:45 IST

పాక్‌ అదుపులో గుజరాత్‌ మత్స్యకారులు!

ఓఖా: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన సుమారు 20 మంది గుజరాత్‌ మత్స్యకారులు తిరిగి రాలేదు! పాకిస్థాన్‌ తీరప్రాంత భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. ఓఖాలోని లతీఫ్‌భాయ్‌కి చెందిన హుస్సేని-3 బోటులో 9 మంది, అల్‌ వసీలా సబీన్‌ బోటులో మరో 11 మంది భారతీయ మత్స్యకారులు ఈ నెల 6న చేపల వేటకు వెళ్లారు. కానీ, ఇంతవరకూ వారు వెనక్కి తిరిగి రాలేదు. వారి నుంచి ఎలాంటి సమాచారమూ రాలేదు. దీంతో మత్స్యకారులను, బోట్లను పాకిస్థాన్‌ తీరప్రాంత భద్రతాధికారులు అదుపులోకి తీసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. సదరు మత్స్యకారుల గురించి తమకు కూడా ఎలాంటి సమాచారం అందలేదని మత్స్యశాఖ అధికారులు చెప్పారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన