62 నిమిషాల్లో 10 కి.మీ.లు

ప్రధానాంశాలు

Published : 24/12/2020 05:19 IST

62 నిమిషాల్లో 10 కి.మీ.లు

పరుగును పూర్తిచేసిన అయిదు నెలల గర్భిణి

బెంగళూరు: టీసీఎస్‌ సంస్థ బెంగళూరులో నిర్వహించిన 10 కి.మీ. పరుగు పోటీలో ఐదు నెలల గర్భిణి పాల్గొని విజయవంతంగా గమ్యాన్ని చేరుకోగలిగారు. రోజూ పరుగును అభ్యసించడం అలవాటుగా ఉన్న అంకిత గౌర్‌.. మిగిలినవారితో పాటు ఆదివారం 10కె పరుగులో పాల్గొని 62 నిమిషాల్లో లక్ష్యాన్ని సాధించారు. ముందుగానే వైద్యులను సంప్రదించాననీ, మధ్యమధ్యలో కాస్త విరామం తీసుకుంటూ పాల్గొనవచ్చని వారు చెప్పడంతో ఆ ప్రకారమే చేశానని ఆమె చెప్పారు. విరామాలతో పరుగెత్తిన కారణంగా ఈసారి పతకం లభించలేదన్నారు. తొమ్మిదేళ్లుగా రోజూ కొంతదూరం పరుగు తీయడం తనకు అలవాటు అని చెప్పారు. వృత్తిరీత్యా ఇంజినీర్‌ అయిన అంకిత 2013 నుంచి ఏటా టీసీఎస్‌ 10కె పోటీలో పాల్గొంటున్నారు. బెర్లిన్‌, బోస్టన్‌, న్యూయార్క్‌లలో జరిగిన అంతర్జాతీయ మారథాన్లలోనూ పాల్గొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన