బ్రిటన్‌లో ఆక్స్‌ఫర్డ్‌ టీకా షురూ
close

ప్రధానాంశాలు

Published : 05/01/2021 04:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్రిటన్‌లో ఆక్స్‌ఫర్డ్‌ టీకా షురూ

82 ఏళ్ల వ్యక్తికి తొలి వ్యాక్సిన్‌

లండన్‌: ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకాలు అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 టీకాను వేసే కార్యక్రమం బ్రిటన్‌లో సోమవారం ప్రారంభమైంది. జాతీయ ఆరోగ్య సర్వీసు (ఎన్‌హెచ్‌ఎస్‌) ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. క్లినికల్‌ ప్రయోగాలకు వెలుపల ఈ వ్యాక్సిన్‌ను వేస్తున్న తొలి దేశం బ్రిటనే. ఈ టీకాను భారత్‌లో సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే బ్రిటన్‌లో ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ల టీకాను వేస్తున్నారు. ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌కు కూడా గతవారం ఇక్కడ అత్యవసర వినియోగ అనుమతి లభించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రాధాన్య వర్గాలకు ఈ వ్యాక్సిన్‌ను వేసే కార్యక్రమం తాజాగా ప్రారంభమైంది. మొదటగా 82 ఏళ్ల బ్రియాన్‌ పింకర్‌కు దీన్ని వేశారు. ‘‘బ్రిటన్‌ శాస్త్ర సాంకేతిక రంగం సాధించిన విజయానికి ఆక్స్‌ఫర్డ్‌ టీకా నిదర్శనం. దీని సాకారం కోసం కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు. రానున్న రోజుల్లో అనేక సవాళ్లు పొంచి ఉన్నాయని మాకు తెలుసు. అయితే కరోనా వైరస్‌ను ఈ ఏడాది మట్టి కరిపిస్తామన్న నమ్మకం ఉంది’’ అని బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ చెప్పారు. కరోనా వైరస్‌పై పోరులో ఇది కీలక పరిణామమని ఆరోగ్యశాఖ మంత్రి మాట్‌ హాంకాక్‌ చెప్పారు. ఇన్‌ఫెక్షన్లను అదుపు చేయడానికి, ఆంక్షలను ఎత్తివేయడానికి టీకాలు వీలు కల్పిస్తాయని తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన