
ప్రధానాంశాలు
ద్విచక్ర వాహనదారుడికి రూ.1.13 లక్షల జరిమానా
రాయగడ, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనానికి రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా.. కనీసం శిరస్త్రాణం కూడా ధరించకుండా నడిపిన ఓ వ్యాపారికి అధికారులు రూ. 1.13 లక్షల జరిమానా విధించారు. ఒడిశాలోని రాయగడ డీవీఐ కూడలి వద్ద బుధవారం పోలీసులు, ఆర్టీవో సిబ్బంది తనిఖీల్లో భాగంగా.. ప్లాస్టిక్ డ్రమ్ముల వ్యాపారం చేసే, మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రకాశ్ బంజారను ఆపారు. అతడు తన వాహనానికి 8 డ్రమ్ములు కట్టుకుని వెళ్తున్నాడు. దీంతో పత్రాలు అడగ్గా ప్రకాశ్ ఏమీ చూపించలేకపోయాడు. తనిఖీ చేయగా వాహనానికి రిజిస్ట్రేషన్ చేయించలేదని, ఏ విధమైన పత్రాలూ లేవని గుర్తించారు. దీంతో భారీ మొత్తంలో జరిమానా విధించారు. ప్రకాశ్ అప్పటికప్పుడు తన సన్నిహితుల వద్ద నుంచి డబ్బు తీసుకుని జరిమానా మొత్తాన్ని చెల్లించాడు.
Tags :
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
సినిమా
- మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
- 30ఏళ్లకు కలిసిన ముగ్గురు అన్నదమ్ములు
- కనిపెంచిన చేతులే.. కాటేశాయి
- వద్దు నాన్నా.. అంటున్నా వినకుండా..!
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?
- ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే: సుప్రీం
- మళ్లీ జయభేరి మోగిస్తున్నా
- పది మంది భార్యలు.. కోట్ల ఆస్తి.. దారుణ హత్య!
- ఎన్నికలను రీషెడ్యూల్ చేసిన ఎస్ఈసీ
- పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
