close

ప్రధానాంశాలు

Updated : 14/01/2021 06:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బాబ్రీ తీర్పుపై అప్పీలు విచారణ వాయిదా

లఖ్‌నవూ: బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో నిందితులను నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యం విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ బుధవారం అలహాబాద్‌ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌ నిర్ణయం తీసుకొంది. ఈ కేసులో భాజపా వ్యవస్థాపక నాయకులు ఎల్‌.కె.ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషీ సహా 32 మందిని దిగువ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. దీనిని సవాలు చేస్తూ అయోధ్యకు చెందిన హాజీ మహమ్మద్‌ అహ్మద్‌, సయ్యద్‌ అఖ్లక్‌ అహ్మద్‌లు ఈ నెల 8న వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసును జస్టిస్‌ రాకేశ్‌ శ్రీవాత్సవ ధర్మాసనం విచారణకు చేపట్టింది. దరఖాస్తులో కొన్ని లోపాలను సరిదిద్దడానికి సమయం కావాలని పిటిషన్‌దారులు కోరడంతో విచారణను వాయిదా వేసింది. ఈ కేసుపై గత ఏడాది సెప్టెంబరు 30న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించకపోవడంతో అయోధ్యవాసులే కేసు పెట్టారని వారి తరఫు న్యాయవాది, బాబ్రీ మసీదు యాక్షన్‌ కమిటీ సమన్వయకర్త, అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు కార్యనిర్వాహక సంఘం సభ్యుడు అయిన జాఫ్రాయబ్‌ జిలానీ తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన