
ప్రధానాంశాలు
మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
దిల్లీ: పెట్రో ధరలు ఆకాశాన్నంటాయి. ఐదు రోజుల విరామం తర్వాత బుధవారం చమురు సంస్థలు మళ్లీ ధరలను పెంచడంతో కొత్త రికార్డులు నమోదయ్యాయి. పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు 25 పైసల చొప్పున పెరిగాయి. దీంతో దిల్లీలో పెట్రోల్ లీటరు రూ.84.45, డీజిల్ లీటరు రూ.74.63కు చేరాయి. దేశ రాజధానిలో పెట్రోల్‌కు సంబంధించి ఇప్పటివరకూ ఇదే గరిష్ఠ ధర కావడం గమనార్హం. ముంబయిలో పెట్రోల్ లీటరు రూ.91.07, డీజిల్ లీటరు రూ.81.34కు పెరిగాయి. ముంబయిలో డీజిల్‌కు సంబంధించి ఇదే అత్యధిక ధర. ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులు కలిపితే కొత్త ధరల్లో ఆమేరకు వ్యత్యాసం కనిపించనుంది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర 26 పైసలు, డీజిల్ ధర 28 పైసలు పెరిగింది. దీంతో అక్కడ పెట్రోల్ లీటరు రూ.87.85, డీజిల్ లీటరు రూ81.45కు చేరింది.
Tags :
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
సినిమా
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణం
- వైట్‌హౌస్‌ను వీడిన ట్రంప్ దంపతులు
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- కష్టాల కడలిలోంచి.. శ్వేతసౌధాన్ని అధిరోహించి
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
