close

ప్రధానాంశాలు

Updated : 14/01/2021 07:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దిల్లీకి కోడికూత లేని సంక్రాంతే!

3 నగర పాలికల్లోనూ పౌల్ట్రీ ఉత్పత్తుల నిషేధం

దిల్లీ: సంక్రాంతి పండుగ సమయంలో దేశ రాజధాని దిల్లీలో కోడికూత మూగబోయింది. బర్డ్‌ఫ్లూ ప్రబలుతున్న నేపథ్యంలో నగరంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు.. మొత్తం మూడు నగర పాలికల్లోనూ పౌల్ట్రీ ఉత్పత్తుల విక్రయాలు, నిల్వలపై బుధవారం నుంచే నిషేధం విధించారు. అధికారుల ఆదేశాలతో ఘాజీపుర్‌ పౌల్ట్రీ మార్కెట్‌ కూడా మూతపడింది. హోటళ్లు, రెస్టారెంట్లలోనూ ఎక్కడా పౌల్ట్రీ ఉత్పత్తులను విక్రయించరాదని ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌, ఝార్ఖండ్‌, జమ్మూ-కశ్మీర్‌ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో బుధవారం అసాధారణ స్థాయిలో పక్షులు మృతిచెందాయి. దిల్లీలోనూ గత వారం రోజుల్లో సంజయ్‌ లేక్‌ వద్ద బాతులు, వివిధ పార్కుల వద్ద పెద్దసంఖ్యలో కాకులు మృతిచెందాయి. అటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో మృతిచెందిన రెండు కాకుల నమూనాలు పరీక్షలకు పంపగా.. పాజిటివ్‌ అని వచ్చింది. దీంతో ఈ నగరంలో నిర్ధరణ అయిన కేసుల అంకె నాలుగైంది. మహారాష్ట్రలోని లాతూర్‌ జిల్లా కేంద్రవాది, సుక్ని గ్రామాల్లో 11,000 కోళ్లు, పక్షులను పూడ్చిపెట్టినట్లు అధికారులు తెలిపారు.
ఆందోళన వద్దు..కోడిమాంసం, గుడ్లు తినండి
మరోవైపు.. ప్రజల్లో అపోహలను పోగొట్టి, అవగాహన పెంచేలా దిల్లీ వైద్యఆరోగ్యశాఖ బుధవారం పలు సూచనలతో కూడిన పత్రాన్ని విడుదల చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఉడకని కోడిమాంసం, గుడ్లు తినకుండా జాగ్రత్తపడితే చాలని పేర్కొంది. 70 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో కనీసం అరగంట ఉడికించిన తర్వాతే తినాలని సూచించారు. ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజాగా పిలిచే ఈ వైరస్‌ (ఏహెచ్‌5ఎన్‌8) మనుషులపై చూపే ప్రభావం చాలా తక్కువని అధికారులు పేర్కొన్నారు. పక్షులతో మసలే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. కేంద్ర పశుసంవర్థక మంత్రిత్వ శాఖ కూడా పౌల్ట్రీ ఉత్పత్తుల సరఫరాపై నిషేధం వద్దని రాష్ట్రాలను కోరింది. పౌల్ట్రీ పరిశ్రమను దెబ్బతీసే తీవ్రమైన ఈ నిర్ణయంపై రాష్ట్రాలు పునరాలోచించాలని సూచించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన