
ప్రధానాంశాలు
చైనాను తిప్పికొట్టే శక్తి భారత్‌కే: అమెరికా
వాషింగ్టన్: సరిహద్దుల్లో చైనా చేస్తున్న కవ్వింపులను సమర్థంగా తిప్పికొట్టే శక్తి భారత్‌కు ఉందని అమెరికా అభిప్రాయపడుతోంది. ఇతర దేశాల మద్దతుతో దృఢమైన భారత దేశమే చైనాకు అడ్డుకట్టవేయగలదని అంచనా వేస్తోంది. ట్రంప్ ప్రభుత్వం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా వ్యూహాత్మక విధానం అనే అంశంపై రూపొందించిన పది పేజీల రహస్య నివేదికను జాతీయ భద్రతా సలహాదారు రాబర్డ్ ఓబ్రియెన్ బహిర్గతం చేశారు. దీన్ని శ్వేతసౌధం వెబ్సైట్లో పెట్టారు. ‘‘భద్రత వ్యవహారాల్లో భారత్ ఎంచుకోవాల్సిన భాగస్వామి అమెరికాయే. దక్షిణ, ఆగ్నేయ ఆసియా, పరస్పర ప్రయోజనాలు ఉన్న ఇతర ప్రాంతాల్లో చైనా ప్రాబల్యానికి అడ్డుకట్టవేయడానికి రెండు దేశాలూ పరస్పరం సహకరించుకోవాలి. చైనాను అడ్డుకునే శక్తి భారత్‌కు ఉంది’’ అని పేర్కొంది.
Tags :
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
సినిమా
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- వైట్‌హౌస్‌ను వీడిన ట్రంప్ దంపతులు
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణం
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- కష్టాల కడలిలోంచి.. శ్వేతసౌధాన్ని అధిరోహించి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
